![]() |
||
శ్రీ రామ రామ -శ్రీ రామ రామ
వేల, తొమ్మిది వందల, తొంబది తొమ్మిది పంచబడినవి. ఒక్క శ్లోకము మిగిలినది. దేవతలు, దైత్యులు, ఋషులు ఈ ఒక్క శ్లోకమునకు పోట్లాడు కొనసాగిరి. ఈ శ్లోకము అనుష్టుప్ ఛన్దములో నున్నది. అనుష్టుప్ ఛన్ద మందు ముప్పది రెండు అక్షరములుండును. శ్రీ శివుడు ముగ్గురకు పది పది అక్షరములను పంచగా చివరకు రెండు అక్షరములు మిగిలెను. అప్పుడు శివుడు " ఈ రెండు అక్షరములను నేను ఎవ్వరికిని ఇవ్వను. ఈ అక్షరములను నా కంఠమందే ఉంచెదను” అని చెప్పెను. ఇవియే “రా” “మ” అను రెండక్షరములు. ఇవియే వేదముల సారము. రామ నామము అతి సరళమైనది, అతి మధురమైనది, అమృతము కంటె తియ్యనయినది. ఇది అమర మంత్రము. శివుని కంఠమందు జిహ్వాగ్ర భాగమందు విరాజమానమై యున్నది. సాగర మన్థన సమయమందు ఉదయించిన హాలాహలమును శివుడు పానము చేయుచుండ భక్తులు హాహాకారములు చేయసాగిరి. అప్పుడు శంకరుడు వారిని ఓదార్చుచు ఇట్లనెను. శ్రీ రామ నామామృత మంత్ర బీజ (ఆనంద రామాయణము) "శ్రీరామ నామము సర్వ మంత్ర బీజము. ఆ సంజీవని నా సర్వాంగముల యందు సంపూర్ణముగ నిండి యున్నది. అందు చేత హాలాహల విషము వలన గాని, ప్రళయానల జ్వాల వలన గాని, మృత్యువు వలన గాని నాకెట్టి భయము లేదు" అని వారితో చెప్పుచు శివుడు విషము త్రాగెను. ఆ విషము అమృతముగ
(శ్రీ మహేశ్వరుడు పార్వతితో) హే సుముఖీ! రామ నామము విష్ణు సహస్ర నామముతో సమానమైనది. నేను సర్వదా రామ రామ రామ అనుచు మనస్సును రంజింపజేయు రామ నామమందే రమించుచుందును''. రామావతారములో సీతా హరణానంతరము శ్రీరాముడు రోదించుచు ప్రతి వనమందు వృక్షములను, లతలను పట్టుకొని సీత జాడ అడుగుచు తన ప్రాణ ప్రియ సీతా వియోగముతో అటునిటు వెదకుచు తిరుగుచుండెను. అట్టి స్థితిలో శివుడు రాముని దర్శించి ఆనందాను భూతి జెందెను. "పరమాత్మ మానవుని వలె ఎట్లు లీలా నాటక మాడుచున్నాడు ! నేను ఎదుట పడి వందనము సమర్పించిన నా భగవానుడు సంకోచించు నేమో! అనుకొనుచు వటవృక్షము చాటుగా పరమాత్మను దర్శించెను. ఆయన రోమములు నిక్క పొడిచెను. నేత్రముల నుండి అశ్రుధారలు స్రవించెను. జయ సచ్చిదానంద జయ పావన ॥ శ్రీరాముడు ద్వాపరమున శ్రీకృష్ణావతారమెత్తి నప్పుడు శివుడు పులి చర్మము ధరించి 'బాబా భోలేనాధ్' అని శృంగనాదము చేయుచు వ్రజ గోకులమున నంద బాబా ద్వారము చెంత కేగెను. యశోద బాబా భయంకర రూపము, చుట్టుకొనిన సర్పములు, శరీరమంతట భస్మము, పొడవైన జడలు, ఎఱ్ఱని శ్రీ శివుడే శ్రీరాముడు, శ్రీరాముడే శ్రీ శివుడు. భక్తులను ఆనందింప జేయుటకు స్వయముగ ఆనందించుటకును ఈ విధముగ ఉపాస్య- ఉపాసక- భావముతోను, పూజ్య-పూజక భావముతోను అనేక లీలలు భగవానుడు చేయుచున్నాడు. భక్తుల పరమారాధ్యుడైన ఆ హరి - హరాత్మక స్వరూపమునకు సనకాది మునుల శ్రీరామ భక్తి సనకాదులు (సనక, సనందన, సనత్కుమార, సనాతనులు) బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ తన శక్తితో నిర్మలాంతః కరణముతో వీరిని సృష్టించెను. వీరు చూచుటకు ఎల్లప్పుడు ఐదు సంవత్సరముల బాలకులవలె నుందురు. కాని శంకరుని కంటె (జన్మలో) పెద్దవారు. వీరు నిరంతరము శ్రీహరిః శరణమ్" అను మంత్రమును జపించుచుందును. వీరు అద్భుత తేజోమయులు, దీప్తి సంపన్నులు, సుందర గుణ శీల యుక్తులు, నిత్యము బ్రహ్మానందములో లీనమై యుండువారు. భగవానుని గుణములను గానము చేయుట, ఆధ్యాత్మిక చింతన, భగవత్ప్రేమ వీరి ముఖ్య ధ్యేయములు. అను ఈ మంత్రములు ధర్మార్థకామ మోక్షముల నొసగును. సాధకులకు రఘునాథుని చరణములపై అనంత భక్తి కల్గించును". సనకాదులు శ్రీరాముని ఇతర మంత్రములను కూడ ఇట్లు చెప్పిరి. “ఓం రామచంద్రాయ నమః; ఓం రామ భద్రాయ నమః అను ఈ రెండును అష్టాక్షర మంత్రములు. ఓం నమో భగవతే రామ చంద్రాయ; ఓం నమో భగవతే రామ భద్రాయ అను ఈ రెండును ద్వాదశాక్షర మంత్రములు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది త్రయోదశాక్షర మంత్రము”. ఈ విధముగ శ్రీరాముని ఇతర మంత్రములు, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమదాది మంత్రములు వాని అనుష్ఠాన పద్ధతులను సనకాదులు నారదునకు ఉపదేశించిరి. సనత్కుమారుని చే చెప్పబడిన ధ్యానము అతిసుం దరము. రామభక్తితో ఓతప్రోతము. రాముని ఎడల ప్రేమను వృద్ధి చేయునది. సీతారాముల ధ్యాన స్వరూప మొకటి ఈ విధముగ నిర్దిష్టమై యున్నది. కాలామ్బోధర కాన్తం చ వీరాసన మాస్థితమ్ । పరమానంద స్వరూప కృపాధాములు. కామనలను పూరించు వారు. మాకు మీపై అవిచల ప్రేమ భక్తి నొసగుడు. హే రఘునాథా! మీరు మమ్ములను పవిత్రులను జేసి, త్రితాపములను, జన్మ మరణములను నశింప జేయు భక్తిని ప్రసాదించుడు. శరణాగత కామధేనూ ! కల్పవృక్ష రూప ప్రభూ! ప్రసన్నులై మాకు ఈ
నారదుని శ్రీరామ భక్తిఅహో దేవర్షి ధన్యో 2 యం యత్కీర్తిం శార్ ఙ్గధన్వనః | ప్రగాయతః స్వవీర్యాణి తీర్ధ పాదః ప్రియ శ్రవాః ! ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి !! (శ్రీ మద్భాగవతము) “నేను పరమ పావన చరణుని గుణగాన సంకీర్తన చేసిన ప్పుడు పిలచి నట్లుగా వెను వెంటనే భగవానుడు ప్రత్యక్షమగును. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు. భగవానుని ఆత్మరూపుడు. దయామ యుడైన భక్త వత్సలుడు చేయదలచిన దానిని నారదునిచే చేయించును''. వాల్మీకి, వ్యాస, శుకదేవ, ప్రహ్లాద, ధృవ, అంబరీషాదులకు నారదుడే భక్తి నుపదేశించెనని పురాణముల యందు స్పష్టమగ నున్నది. శ్రీమద్భాగవతము, శ్రీవాల్మీకి రామాయణము రెండును అపూర్వమైనవి. ఇవి ఈడున దయతోనే లోకమునకు శ్రీరామునితో నారదుడు “ప్రభూ ! సాధారణ మానవుని వలె మాటాడుచు నన్నెందుకు మోహమందు పడవేయుచుంటిరి? మీరు సాధారణ మానవులు కారు. ఆదిశక్తి స్వరూపిణి భగవతి సీత మహా మాయా స్వరూపిణి. ప్రభూ! మీరు మాయతో బ్రహ్మాది సమస్త ప్రజలను ఉత్పన్నులను చేయుదురు. ఆ త్రిగుణాత్మిక మాయ సదా మిమ్ము ఆశ్రయించియే యుండును. మీరు విష్ణు భగవానులు, జానకి లక్ష్మీదేవి. మీరు శివులు, జానకి పార్వతి. మీరు బ్రహ్మ, జానకి సరస్వతి. మీరు సూర్య దేవులు, జానకి ప్రభ. నిస్సందేహముగ స్త్రీ వాచకములన్నియు శ్రీ జానకీ దేవియే. మరి పురుష వాచకములన్ని మీరే అయియున్నారు. దేవా! త్వం విష్ణుర్ణానకీ లక్ష్మీ: శివస్త్వం జానకీ శివా ॥ లోకే స్త్రీ వాచకం యావత్ తత్సర్వ జానకీ శుభా | పున్నామ వాచకం యావత్ తత్సర్వంత్వం హి రాఘవ ॥ సంవాదం పఠతి శృణోతి సంస్మరేద్వా
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ । భగవన్నామ యశస్సును కీర్తించుటలో వాల్మీకి మహర్షి అద్వితీ యుడు. శ్రీరాముని విశేషములను విశ్వ మందు ప్రకటించిన కీర్తి వాల్మీకి మహర్షిదే. వాల్మీకి రామాయణమే ఆది కావ్యము లేక ఆది రామాయణము. రాముని చరిత్ర కారులైన కవులందరికి శ్రీమద్వాల్మీకి రామాయణమే ఉపజీవ్యము. అందుచేతనే అందరు తమ రచన ప్రారంభమున వాల్మీకి మహర్షికి ప్రణామము లర్పించిరి. వేదములలో వర్ణించబడిన పరమతత్త్వమే శ్రీమన్నారాయణ తత్త్వమే శ్రీమద్రామాయణ మందు శ్రీరాముని రూపమున నిరూపింపబడినది. వేద వేధ్య పరమ పురుషోత్తముడు దశరథనందనుడగు శ్రీరాముని రూపమున నవతరించుటచే సాక్షాత్తుగా వేదములు ప్రచేత సపుత్రుడగు శ్రీ వాల్మీకి మహర్షిచే చెప్పబడిన శ్రీ రామాయణ రూపముతో ప్రకటమైనవి. వాల్మీకి మహర్షి మొదట రత్నాకరుడు (అగ్నిశర్మ) అను దోపిడి దొంగ శ్రీరామ నామ జపముతో బ్రహ్మతో సమానముగ పూజ్యుడయ్యెను. వాల్మీకి రామాయణ మందు మహర్షి వాల్మీకి దశరథ మహారాజు మంత్రులలో ఒకరిని చెప్పబడినది. శ్రీరాముడు వనమునకు వెళ్ళుచు చిత్రకూటములోని వాల్మీకి ఆశ్రమ మందు ఒక దినము గడిపెను. వాల్మీకి ఆశ్రమ ములుకొన్ని చిత్రకూట సమీపమునను, కొన్ని ప్రయాగ సమీపమునను, వసిష్ఠ మహర్షి శ్రీరామ భక్తి
బ్రహ్మ మానస పుత్రుడైన వసిష్ఠ మహర్షి తపః స్వరూపుడు క్షమామూర్తి. ఇతని ఆవిర్భావ కథ వివిధ పురాణ ములలో పలురకములుగ నున్నది. కొన్నిటిలో బ్రహ్మ మానస పుత్రుడనియు, ఆగ్నేయ పుత్రుడనియు, మిత్రావరుణ పుత్రు డనియు చెప్పబడినది. కల్ప భేదముతో చూచిన ఇవి అన్నియు సత్యమైనవే. వసిష్ఠ మహర్షి సప్త ఋషులలో ప్రధానుడు. అద్వైత అగస్త్య మహర్షి శ్రీరామ భక్తి
రామో . పి ముని మాయానం దృష్ట్వా హర్ష సమాకులః! మునీశ్వరుడు వచ్చుట గాంచిన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సహితుడై పృథ్విపై దండప్రణామములు చేసెను. ముని వెను వెంటనే రాముని లేపి ప్రేమ పూర్వకముగ హృదయమునక= చేర్చుకొనెను. శ్రీరాముని శరీర స్పర్శ పొందిన ముని నేత్రములు ఆనంద జలపూరితము లయ్యెను. అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ! "శ్రీరామా! పూర్వ కాలమందు విష్ణు భగవానుడు ఈ ధనస్సుతోనే యుద్ధ మందు గొప్ప గొప్ప రాక్షసులను సంహరించి దేవతలకు అధికార లక్ష్మిని తిరిగి చేకూర్చెను. మీరు ఈ ధనస్సును, ఈ రెండు తూణీరములను, ఈ బాణములను రాక్షసులపై విజయము పొందుటకు వజ్రధారి ఇంద్రుడు వజ్రమును గ్రహించినట్లు గ్రహింపుము" అనెను. పద్మ పత్రాక్ష శ్రీరాముడు అగస్త్య మహర్షి చరణములకు ప్రణామము లర్పించి అచటి నుండి దండక వనమునకు ప్రయాణము వెళ్ళెను. మహర్షి ధన్యుడు. వాని రామ పద ప్రీతి ధన్యము. భరద్వాజుని శ్రీరామ భక్తి
యాజ్ఞ వల్క్య మహర్షి ప్రసన్నుడై శ్రీరాముని చరిత్రను వర్ణించెను. ఈ విధముగ భరద్వాజుని కృపతో లోకమున శ్రీరాముని చరిత్రమను మంగళ ప్రవాహము ప్రవహించెను. (రామ చరిత మానసము) ఆరణ్యక ముని శ్రీరామ భక్తిరామనామ బిను గిరాన సోహా |దేఖు బిచార త్యాగి మద మోహా ॥ రాముడు త్రేతాయుగ మందు అవతరించెను. అంత కంటె ముందు ఆరణ్యక ముని పరమాత్మ తత్త్వమును గ్రహించి, పరమ శాంతి పొందుటకు ఘోరముగ తపస్సు చేయుచుండెను. దీర్ఘకాలమైనను తపఃఫలము లభించ లేదు. అప్పుడు ముని మరి యొక జ్ఞాని యగు పురుషుని వెదుక నారంభించెను. అతడు అనేక తీర్ధములు తిరిగెను. ఎంత మందినో కలిసెను. కాని సంతోషము గలుగలేదు. అతడు ఒక దినము తపోలోకము నుండి తీర్థ యాత్ర కొరకు క్రిందికి దిగిన లోమశ ఋషిని దర్శించెను. ఆ ఋషిని సమీపించి చరణములకు ప్రణామములు గావించి నమ్రతతో ఇట్లు ప్రార్ధించెను. "మహాత్మా ! దుర్లభమైన మానవ శరీరము పొందిన జీవులు, ఏ ఉపాయమున ఈ సంసార సాగరమును దాటవలెను ? మీరు దయతో నాకేదైన అట్టి వ్రత, దాన, జప, యజ్ఞములు గాని, దేవారాధన గాని ఉన్న చెప్పి ఈ భవసాగరము నుండి దాటించుడు”. “దాన తీర్థ వ్రత యమ నియమ యజ్ఞ యోగ తఫః ప్రభృతు లన్నియు ఉత్తమమైన కర్మలు. కాని వీని ఫలితము స్వర్గము. ఎప్పటి వరకు పుణ్యముండునో ప్రాణులు అప్పటి వరకు స్వర్గ మందు సుఖము లనుభవించెదరు. పుణ్యము సమాప్తమైన తరువాత క్రింద పడదురు. అయినను వీరు శుభ కర్మలు చేయని మూఢుల కంటె ఉత్తములు. చూడుము నేను నీకు ఒక ఉత్తమమైన రహస్యమును చెప్పుచున్నాను వినుము. శ్రీ రామ భగవానుని కంటె గొప్ప దేవతలు లేరు. రామ వ్రతము కంటె ఉత్తమమైనది లేదు. రాముని కంటె శ్రేష్టమైన యోగము లేదు. గొప్ప యజ్ఞములు కూడ లేవు. శ్రీరామ నామ జపము, శ్రీరాముని పూజించుట చేయు మనుష్యులు ఈ లోకము నందును, పరలోకము నందును సుఖపడెదరు. శ్రీరాముని శరణు వేడిన ప్రాణులు అనాయాసముగ సంసార సాగరమును దాటుదురు. శ్రీరాముని స్మరించి ధ్యానించు మానవుల అన్ని కోరికలు సిద్ధించును. ఇట్టి వారికి పరమపద ప్రాప్తిని కలిగించు భక్తి శ్రీరాముడే ఇచ్చును. ఉత్తమ కులమందు జన్మించిన వారి మాటకేమి గాని, చాండాలురైనను ప్రేమతో శ్రీరాముని స్మరించిన పరమగతిని పొందుదురు. శ్రీరాముడొక్కడే పరసు దైవము. శ్రీరాముని పూజించుటే ప్రధాన వ్రతము. రామ నామమే సర్వోత్తమమైన మంత్రము. శ్రీరాముని స్తుతియే ఉత్తమ శాస్త్రము. అందువలన నీవు హృదయ పూర్వకముగ శ్రీరాముని భజింపుము, పూజింపుము, ధ్యానింపు" మని లోమశ మహర్షి ఉపదేశించెను. ఉపదేశము వినిన ఆరణ్యక ముని అమితానందుడయ్యెను. "ధ్యానించుటకు శ్రీరాముని స్వరూపమును తెలుపు" డని "రమణీయా యోధ్యా నగర మందు కల్పతరువు క్రింద విచిత్ర మండప మందు శ్రీరామ చంద్ర భగవానుడు విరాజమా -నుడై యుండును. మహామరకతమణి, నీలకాంతమణి స్వరములతో నిర్మించిన అతిమనోహరమైన సింహాసనము వానిది. ఆ •ంహా సనము కాంతి నాలుగు వైపులకు వెదజల్లబడుచుండును. నూర్వా దల శ్యామ సౌందర్య సాగరుడు, దేవేంద్ర పూజితుడు భగవానుడగు శ్రీరఘునాథుడు సింహాసనముపై కూర్చుంది తన ప్రకాశముతో మునుల మనస్సులను హరించుచుండెను. వాని ముగ్ధ ముఖ మండలము కోట్ల చంద్రుల కాంతిని మించియున్నది. వాని కర్ణములకు మకరాకృతి కుండలములు, మస్తకముపై కిరీటముశోభించుచుండెను. కిరీట మందున్న మణుల రంగుల కాంతితో శరీరము రంజిత మగుచున్నది. మస్తకముపై నల్లని ఉంగరములు తిరిగిన కేశము లున్నవి. ముఖమందు చంద్ర కిరణముల వంటి దంత పంక్తి శోభించు చున్నది. వాని అధరము విద్రుమ మణి వలె మనోహరముగ నున్నది. వీని యందు శాస్త్ర సహిత ఋక్సామాది నాలుగు వేదముల స్ఫూర్తి యున్నది. వాని ముఖ కమల మందు నాసిక జపాం కుసుమము వలె నున్నది. వాని కంఠము కమనీయ శంఖము వలె నున్నది. వీని రెండు భుజములు సింహ స్కంధముల వలె ఎత్తుగ బలముగ నున్నవి. బాహువులు మోకాలి వరకు ఉన్నవి. చేతుల యందు పచ్చల ఉంగరములు మెరయు చున్నవి. కేయూర కంకణములు అపూర్వముగ శోభిల్లు చున్నవి. వీని మనోహర విశాల వక్షఃస్థలము శ్రీలక్ష్మీ శ్రీవత్సాది విచిత్ర చిహ్నములతో విభూషితమై యున్నది. ఉదర మందు మూడు రేఖలున్నవి. నాభి గంభీరముగ నున్నది. మనోహరముగ నున్న నడుమున మణులతో పొదిగిన మొలత్రాడు శోభతో నున్నది. సుందరమైనవి భుజములు, మనోహరమైనవి మోకాళ్ళు. యోగులకు ఆరాధ్యము పరమ మంగళమయమునగు చరణయు గల మందు వజ్రము, అంకుశము, ధ్వజాది చిహ్నములు అంకితములై యున్నవి. హస్త మందు ధనుర్బాణములు, భుజ స్కంధములపై అంబులపొది శోభించు చున్నవి. ముఖముపై సుందరమైన తిలకము గలదు. ఈ దివ్య శోభా పూర్ణాకృతితో శ్రీరాముడు అందరి చిత్తములును బలవంతముగ తన వైపు లాగుచున్నాడు". ఈ విధముగ ప్రకాశించుచున్న శ్రీరాముని దివ్య స్వరూపమును లోమశుల వారు వర్ణించి చెప్పి "మునీ! ఈ విధముగ నీవు శ్రీరామ భగవానుని ధ్యానించి స్మరించిన అనాయాసముగ సంసార సాగరమును దాట గలవు" అని చెప్పెను. లోమశుల వారి మాటలు వినిన ఆరణ్యక ముని వినయ ముగ ''భగవానుడా ! నా యందు దయతో శ్రీరాముని ధ్యానముగ చెప్పి గొప్ప మేలు చేసితిరి. మీ ఉపకార భారముతో ముడుచుకొని పోయితిని. స్వామీ! ఈ శ్రీరాముడెవరు ? వీని మూల స్వరూప మేది ? ఈ అవతారము ఎందుకు ధరించెను ? చెప్పు"అని కోరెను. లోమశ మహర్షి ''వత్సా! పూర్ణ సనాతన పరాత్పర పరమాత్మయే శ్రీరాముడు. సమస్త విశ్వ బ్రహ్మాండములను ఇతడే ఉత్పత్తి గావించెను. ఇతడే సర్వధారుడు. అందరిలో వ్యాపించి యున్న అందరి స్వామి. అందరిని సృష్టించువాడు, పాలించువాడు, సంహరించువాడు ఇతడే. సమస్త విశ్వము ఇతని లీలా వికాసమే. వేద వ్యాసుని శ్రీరామ భక్తినమో స్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విన్దయత పత్ర నేత్ర యేన త్వయా భారత తైల పూర్ణః పజ్వాలితో జ్ఞాన మయః ప్రదీపః అష్టాదశ పురాణ కర్త, మహాభారత రచయిత, బ్రహ్మ సూత్ర నిర్మాత, వేదములను శాఖోపశాఖలుగా విభజించిన వేదవ్యాసుడు నారాయణునితో సమానుడు. శరభంగుని శ్రీరామ భక్తిదండకారణ్య తపో భూమి యందు అనేక బ్రహ్మర్షులు ఘోర తపస్సు చేయుచుండిరి. కఠినమైన యోగా భ్యాసము ప్రాణాయామములతో సమస్త పదార్ధముల యందాసక్తి మమకార ములను, కోరికలను సమూలముగ నశింప జేసి తమ తపస్సుతో సమస్తేంద్రియములపై సంపూర్ణ విజయమును పొందిన ఋషులలో శరభంగ మహర్షి ఒకరు. ఇతడు తన తపస్సుతో బ్రహ్మలోకముపై విజయము పొందెను. సాదరముగ బ్రహ్మలోకమునకు తీసికొని వెళ్ళుటకు దేవేంద్రుడు వచ్చెను. ఆకాశమునకు భూమికి మధ్యలో ఆగిన ఇంద్ర రథమును మహర్షి చూచెను. తనను తీసికొని వెళ్ళుటకే వచ్చెనని తెలిసెను. కాని రాజీవలోచనుడు కోసల కిశోర శ్రీరాఘ వేంద్రుడు భగవతి శ్రీ సీతతోను, తమ్ముడు లక్ష్మణునితోను కలసి తన ఆశ్రమము వైపు వచ్చుచున్నాడను వార్త వినెను. "అహో! లౌకిక వైదిక సమస్త ధర్మపాలనము ఏ వాని చరణ కమలములను పొందుట కొరకో అట్టి భగవానుడు స్వయముగ నా ఆశ్రమము వైపు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఇది వదలుకొని నేను బ్రహ్మలోకమునకు వెళ్ళుట సర్వదా మూర్ఖత్వమగును. బ్రహ్మలోకమునకు ప్రధానుడైన దేవుడు నా దగ్గరకు ఇచటికి వచ్చుచున్నాడు గనుక నేనచటికి వెళ్ళుట నిష్ప్రయోజనము. తపః ప్రభావముతో అక్షయ లోకములపై పొందిన అధికారమంతయు నేను భగవానుని చరణములకు సమర్పించెదను " అని ఒక నిశ్చయమునకు వచ్చి ఇంద్రునకు రానని చెప్పి పంపివేసెను. శ్రీరాముని దర్శించి వాని ఎదుటనే ప్రాణ త్యాగము చేయుటకు నిర్ణయించు కొనెను. క్షణమొక యుగముగ తల పోయుచు రాముని కొరకు ఎదురు చూచు చుండెను.అనసూయాత్రి మహర్షుల శ్రీరామ భక్తిపరమ తపస్వి అయిన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు, ప్రజాపతి. ఇతడు దక్షిణ దిశా నివాసుడు. పరమ పతివ్రత అనసూయ వీనిపత్ని. అనసూయ స్వాయంభువమను పుత్రిక అయిన దేవహుతి కుతూరు. కపిల భగవానుని చెల్లెలు. కరమ మహర్షి ఈమె తండ్రి. రాగ ద్వేషములు లేని పరమ భగవద్భక్తుడు అత్రి మహర్షి. పరమభక్తురాలు, అసూయ లేనిది అనసూయ. బ్రహ్మ వీరిని సృష్టి గావించమని ఆజ్ఞాపించెను. కాని వీరు ముందుగా తపస్సు చేయుటకు నిర్ణయించుకొనిరి. కఠోరమైన తపస్సు చేయసాగిరి. వీరి తపస్సు యొక్క ఉద్దేశ్యము అఖిల సృష్టికర్త పరమ ప్రభుని దర్శించ వలెననియే. దీర్ఘకాల కఠోర తపస్సు చేయు నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వరమడుగుడనిరి దంపతులు చేతులు జోడించి వినయముగ “మా మనస్సు లందు లౌకిక వాంఛలు లేవు. కాని విధాత సృష్టి గావింపుమని ఆజ్ఞాపించెను. అందువలన మీరు ముగ్గురు పుత్ర రూపములలో ఇచట అవతరింపుడు" అని కోరుకొనిరి. త్రిమూర్తులు "తథాస్తు" అని పలికి అంతర్ధానమైరి. కొంత సేపటికి వారు శ్రీవిష్ణు అంశతో దత్తాత్రేయుడుగను, బ్రహ్మ అంశతో చంద్రుడుగను, శంకరుని అంశతో దుర్వాసుడుగను అవతరించిరి. త్రిమూర్తులు పరమ భక్తులైన ఆ దంపతుల ఓడి యందుఆటలాడు చుండిరి. అనసూయ నిరంతరము బాలల సంరక్షణ లోనే గడుపు చుండెను. శ్రీరామ భగవానుడు అత్రి అనసూయల శ్రద్ధా భక్తుల నెఱిగి సీతా లక్ష్మణ సహితుడై వీరి ఆశ్రమమునకు వచ్చెను. సీతా రామ లక్ష్మణులు తమ ఆశ్రమమునకు వచ్చిరను సమాచారము వినిన మహర్షి పులకితుడై మునిజన వందితుడగు శ్రీరాముని చూచుటకు పరుగులు తీసెను. (మానస)గత్వా ముని ముపాసీనం భాసయన్తం తపో వనమ్ | దండవత్ ప్రణి పత్యాహ రామో . "హమభివాదయే ॥ పితు రాజ్ఞాం పురస్కృత్య దండ కావన మాగతః | వన వాస మిషేణాపి ధన్యో హం దర్శనాత్తవ ॥ సమస్త తపోవనమును ప్రకాశింపజేయు మునీశ్వరుని చెంతకు రాముడు వెళ్ళి ప్రణామము గావించి "నేను రాముడను. మీకు అభివాదనము చేయుచున్నాను. నేను తండ్రి ఆజ్ఞానుసారము దండకారణ్యమునకు వచ్చితిని. వనవాస సమయములో మిమ్ములను దర్శించి కృతార్థుడనైతిని" అనెను. వందనము చేయుచున్న శ్రీరాముని వెను వెంటనే మహర్షి లేవనెత్తి హృదయమునకు హత్తుకొనెను. మహర్షినేత్రముల నుండి ప్రేమాశ్రువులు స్రవించుచుండెను. శ్రీరాముని అలౌకిక సౌందర్యమును గాంచిన ముని నేత్రములు శీతలములయ్యెను. అత్రి ఆదరముగ శ్రీరాముని తన ఆశ్రమములోనికి తీసికొని వెళ్ళెను. (అధ్యాత్మ రామాయణము) అనంతరము సీతా రామ లక్ష్మణులను పవిత్రాసనములపై కూర్చుండ బెట్టి విధి పూర్వకముగ పూజించి, నవఫలములతో వారికి అతిథి సత్కారములు గావించెను. ఆసనముపై ఆసీనుడైన కమలదళ లోచనుని మహర్షి తనవితీర దర్శించి కృతార్థుడయ్యెను. (మానస) దేవకార్య నిమిత్తం చ యయా సం త్వరమాణయా। దశ రాత్రం కృతా రాత్రిః సేయం మాతేవ తే. నఘ ॥ తామిమాం సర్వ భూతానాం నమస్కార్యాం తపస్వినీమ్! అభిగచ్చతు వైదేహీ వృద్ధాను క్రోధనాం సదా ॥ (వాల్మీకి రామాయణము) శ్రీరామా! ఈమె దేవకార్య నిమిత్తము పది రాత్రులను ఒకే రాత్రిగ చేసినట్టి అనసూయాదేవి. మీకు తల్లి వలె పూజనీయురాలు. సర్వప్రాణులు నమస్కరింపదగిన తపస్విని. క్రోధమెరుగనిది. విదేహ నందిని సీతను వృద్దురాలైన అనసూయ చెంతకు పంపుము" అని మహర్షి చెప్పెను. శ్రీరాముని ఆదేశమును పొందిన సీతాదేవి అనసూయను సమీపించి ఆమె చరణములపై బడెను. తన పాదములపై బడిన సీతను గాంచి అనసూయా దేవి హర్షముతో "బిడ్డా ! సీతా” ! అనుచు ఆదరముతో ఆలింగనము చేసికొని విశ్వకర్మ నిర్మించిన రెండు పట్టు చీరలును, దివ్యాంగ రాగమును నొసగి "కమల ముఖీ! ఈ అంగరాగమును ధరించిన నీ శరీర శోభ ఎన్నిటికిని తరుగదు!” అని చెప్పెను. అనంతరము అనసూయ సీతకు పతివ్రతా ధర్మ ములను చక్కగ ఉపదేశించెను. "రఘునాథునితో కలసి సుఖముగ తిరిగి నీ గృహమున కేగుదువు" అని అనసూయ ఆశీర్వదించగా సీత ప్రసన్నురా లయ్యెను. అనసూయ రామునితో "రామా! మీరు సమస్త భువన ముల సృష్టి కర్తలు. ప్రపంచమును మోహింప జేయు మాయ కూడ సదా మీకు భయపడుచుండును” అని కొనియాడెను. శ్రీసీతారామలక్ష్మణులు ఆ రోజు అత్రి మహర్షి ఆశ్రమ మందు విశ్రమించి రెండవ రోజు అత్రి మహర్షితో "మునీశ్వరా ! మేము ఋషులు, మునులతో నిండిన దండ కారణ్యమునకు వెళ్ళవలెనని కోరుకొనుచుంటిమి. మాకు మార్గము చూపుటకు మీ శిష్యులను మా వెంట పంపుడు" అని శ్రీరాముడు కోరగా అత్రి ముని నవ్వుచు “ రామా ! దేవతా శ్రయ స్వరూపా ! సర్వులకు మార్గదర్శకుడవు నీవై యుండగా నీకు మార్గదర్శకులు ఎవరు ? కాని ఇప్పుడు మీరు లోకవ్యవహారమును అనుసరించుచున్నారు.గాన శిష్య గణమును మీకు మార్గము చూపుటకు పంపుదును" అని చెప్పెను. భక్త వాంఛాకల్ప తరువగు శ్రీరామ ప్రభువు అత్రి మహర్షి చరణములపై శిరస్సు నుంచి దండ కారణ్యమునకు ప్రయాణ మయ్యెను. మహర్షి నిలువబడి అశ్రుపూరిత నయనములతో చూడసాగెను. శ్రీరాముని ప్రేమను పొందగలిగిన అనసూయాత్రి మహర్షులు ధన్యులు, వందనీయులు. దశరథ మహారాజు వాత్సల్య భక్తి
దశరథ మహారాజు పరమ తేజస్వి. మను మహారాజు ) లె ప్రజలను రక్షించినవాడు. ఇతడు వేదములు తెలిసిన వాడు, గొప్ప సేనకు ప్రభువు, ప్రజా రక్షకుడు, దూరదర్శి, దేశవాసులకు ప్రియుడు, మహాయజ్ఞములు చేసిన వాడు, ధర్మ ప్రియుడు, మహర్షుల వలె సద్గుణములు గలవాడు, రాజర్షి, త్రిలోక ప్రసిద్ధుడు, పరాక్రమ వంతుడు, శత్రు నాశకుడు, ఉత్తమమైన మిత్రులు గలవాడు, జితేంద్రియుడు, సంపదలలో కుబేరుని అంతటివాడు, ఇంద్రునితో సమానుడు, సత్య ప్రతిజ్ఞాపాలకుడు, ధర్మార్ధ కామములను శాస్త్రాను సారముగ పాలించువాడు.దశరథుని మంత్రి మండలి యందు వసిష్ఠ మహాముని, వామదేవుడు, సుయజ్ఞుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు, కాత్యాయనుడు, దృష్టి, జయంతుడు, విజయుడు, సురాష్ట్రుడు, రాష్ట్ర, వర్ధనుడు, అకోపుడు, ధర్మపాలుడు మున్నగువారు విద్యా వినయ సంపన్నులు, శ్రీ పంపన్నులు, పవిత్ర హృదయము గలవారు, శాస్త్రజ్ఞులు, శస్త్రజ్ఞులు, ప్రతాపవంతులు, రాజనీతి విశారదులు, సావధానులు, రాజాజ్ఞను అనుసరించువారు, తేజస్వులైన క్షమాశాలురు, నగుమోము గలవారు, కామ క్రోధ లోభరహితులు, సత్యవాదులైన పురుష ప్రవరులునై యుండిరి.ఆదర్శవంతుడైన రాజు, మంత్రి మండలితో ప్రజలు సుఖ సంపన్నులై యుండిరి. దశరథుని సహాయము దేవతలు కూడ కోరుచుండిరి. ఇతడు అనేక యజ్ఞములు చేసెను. చివరి సారి జననీ జనకుల భక్తుడైన శ్రవణ కుమారుని వధించిన పాపమునకు ప్రాయ శ్చిత్తముగా అశ్వమేధము, జ్యోతిష్టోమము, ఆయుష్టోమము, అతిరాత్రము, అభిజిత్, విశ్వజిత్, ఆప్తోర్యామాది యజ్ఞములు గావించెను. ఈ యజ్ఞము లందు ఇతర వస్తువులు గాక పది లక్షల పాడి యావులను, పది కోట్ల సువర్ణ ముహరీలను, నలుబది కోట్ల వెండి రూపాయలను దానమిచ్చెను. దీని తరువాత పుత్రప్రాప్తికి ఋష్యశృంగుని ఋత్విజునిగ నియమించి దశరథుడు పుత్రేష్టి యజ్ఞమును చేసెను. ఈ యజ్ఞ మందు సమస్త దేవతలు తమ తమ భాగమును గ్రహించుటకు స్వయముగ వచ్చిరి. దేవతలు, మునులు, ఋషులు ప్రార్ధించగా భగవానుడు దశరథుని పుత్రునిగా అవతరించుటకు ఆమోదించెను. యజ్ఞ పురుషుడు స్వయముగ ప్రత్యక్షమై పాయసముతో నిండిన సువర్ణ పాత్రను దశరథునికిచ్చి "రాజా! ఈ పాయసము దేవతలచే తయారు చేయబడినది. ఇది సంతాన ప్రాప్తిని గలిగించును. ధనవృద్ధిని, ఆరోగ్య వృద్ధినిని గూడ గలిగించును. దీనిని నీ రాణులకు ఇమ్మ"నెను. రాజు ప్రసన్నుడై మర్యాదానుసారము కౌసల్య ధర్మపత్ని గనుక బంగారు పాత్రలోని పాయసమును సగము చేసి కౌసల్యకు ఇచ్చెను. మిగిలిన సగ భాగమును రెండు భాగములుగ జేసి ఒక భాగమును సుమిత్రకు ఇచ్చెను. మిగిలిన ఒక భాగమును రెండు భాగములుగ జేసి ఒక భాగము కైకకు ఇచ్చెను. మిగిలిన ఆ అర్థ భాగమును రాజు ఆలోచించి సుమిత్ర మధ్య భార్య కావున ఆమెను ఆనంద పరచుటకు మజల సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగ రాజు పాయసమును ముగ్గురు భార్యలకు పంచి పెట్టెను. కౌసల్యకు 12వ మాసమున చైత్ర శుక్ల పక్షమున నవమి తిథి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్న మందు శ్రీరాముడు జన్మించెను. అనంతరము కైకకు పుష్య నక్షత్రము మీ భరతుడు జన్మించెను. లగ్న మందు ఆ తరువాత సుమిత్రకు ఆశ్లేషా నక్షత్రము కర్క లగ్న మందు రెండు భాగములు గ్రహించిన కారణమున లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించిరి. ఈ విధముగ భగవానుడు నాలుగు రూపములతో అవతరించెను. రాజునకు ఈ నలుగురు పుత్రులు పరమ ప్రియులైనను శ్రీరాముని యందు విశేషమైన ప్రేమ గలదు. శ్రీరాముని కొరకే కొన్ని వేల సంవత్సరములు నిరీక్షించిన వాడు కావున, ఒక్క క్షణము కూడ శ్రీరాముని చూడకుండ నుండగలిగెడి వాడు కాదు. విశ్వామిత్రుడు యజ్ఞ రక్షార్ధము శ్రీరాముని పంపుమని అడుగుటకు వచ్చినప్పుడు రాముని వయస్సు 15 సంవత్సరములు పూర్తి అయి యుండెను. దశరథుడు రాముని పంపుటకు ఆమోదించ లేదు. వసిష్ఠులు నచ్చ జెప్పిన తరువాత ఆమోదించెను. "శ్రీరాముడు నా ఎదుట ఉన్నంత వరకే నా ప్రాణములు నిలచి 'యుండును" అనెను. తన వచనము సత్యము చేయుటకే రామ ప్రేమానల మందు తన ప్రాణము ఆహుతి ఇచ్చెను. భగవానుడు కైక మతిని మార్చి అనేకములగు పనులు చేయించెను. జగత్తులో ఆదర్శ మర్యాదను స్థాపించుటకే భగవానుడు అవతరించెను. ముఖ్యమైన ఆదర్శములు :- 1. దశరథుని సత్య రక్షణ - శ్రీరాముని ప్రేమ. 2. వనవాసము చేయుచు రాక్షసులను వధించి దుష్ట సంహారము చేయుట. 3. శ్రీభరతుని త్యాగము - ఆదర్శమైన సోదర ప్రేమ. 4. శ్రీ లక్ష్మణుని బ్రహ్మ చర్యము - సేవాభావము రామ పరాయణత త్యాగము. 5. శ్రీ సీతా దేవి ఆదర్శ పవిత్ర పాతివ్రత్య ధర్మము. 6. శ్రీ కౌసల్యా పుత్ర ప్రేమ కోడలిపై ప్రేమ - పాతివ్రత్యము - ధర్మ ప్రేమ - రాజనీతి కుశలత. 7. సుమిత్రకు శ్రీరాముని యందు ప్రేమ రాజనీతి త్యాగము - కుశలత. 8. కైకేయి దుష్ట బుద్ధి - తిరస్కరింపబడియు రాముని ఎడల కఠినత్వము. 9. హనుమానుని నిష్కామ ప్రేమ భక్తి. 10. విభీషణుని శరణాగతి అభయ ప్రాప్తి, 11. సుగ్రీవునితో రామునికి ఆదర్శ స్నేహము. 12. రావణాదుల వినాశము అంతమున ఉద్దరించుట. శ్రీరామునకు వనవాసము లేకున్న ఇవి కష్టమయ్యెడివి. ఇవి అన్నియు ఆదర్శ మర్యాదలు, అనుకరణీయములు. దశరథుని వంటి భాగ్యవంతులు ఎవరుందురు? శ్రీరాముని దర్శించ వలెనను కోరికతో రాముని కొరకు రామ రామ రామ అనుచు ప్రాణ త్యాగము చేసెను. లంకా విజయానంతరము దశరథుడు శ్రీరాముని దర్శించెను. దశరథుడు శ్రీరాముని సమీపించి శ్రీరాముని ఆలింగనము చేసికొని ప్రేమాలాపనలు కావించెను. తరువాత లక్ష్మణునితో "సుమిత్రా సుఖవర్ధన లక్ష్మణా! నీవు నిరంతరము శ్రీరాముని సేవ యందే యుండవలెను. దీని వలన నీకు గొప్ప శుభము గలుగు" నని ఉపదేశించెను. ఆ తరువాత సీతతో కూడ మాటాడెను. త్రిలోక వాసులు, సిద్ధపురుషులు, మహర్షులు, మునులు పురుషోత్తముడైన శ్రీరామునికి అభివందనములు చేసి పూజించిరి. ఎవరిని వేదములలో అవ్యక్త అక్షర బ్రహ్మయని, దేవతల హృదయమని, గుప్త తత్త్వమని చెప్పుచున్నారో ఆ పరమ తపస్వి. రాముడితడే. కౌసల్యా భక్తి హృదయమురామాయణ మందు మహారాణి కౌసల్య చరిత్ర ఎంతయు మదారమైనది, ఆదర్శమైనది. ప్రాచీన కాలమందు మను- శత రూపలు తప మొనరించి శ్రీరాముని పుత్రునిగా పొందు వరము పొందిరి. ఆ మను శతరూపలే దశరథ కౌసల్యలు. శ్రీరామ భగవానుడు పుత్రుడుగా వీరి గృహ మందు అవతరించెను.శ్రీరామునికి రాజ్యాభిషేకము చేయవలెనని నిర్ణయించి నప్పుడు కౌసల్య ఆనందమునకు అవధి లేదు. ఈమె శ్రీరామునికి శుభము జరుగవలెనను కోరికతో అనేక యజ్ఞములు, దానములు, దైవ పూజలు చేయుచు, ఉపవాస వ్రతమందు నిమగ్నమై యుండెను. దర్మము కొరకు త్యాగముశ్రీరాముడు వనవాసమున కేగవలెనని నిశ్చయించి నప్పుడు తల్లి ఆజ్ఞను తీసికొనుటకు కౌసల్యా భవనమునకు వచ్చెను. శ్రీరామ చంద్రుడు తల్లిని సమీపించెను. రాముని చూడగానే వెంటనే లేచి పుత్రుని ఆలింగనము చేసికొని శిరస్సు విమీరెను. కౌసల్య నేత్రముల నుండి ప్రేమాశ్రువులు స్రవించు చుండెను. రాముడు ఉపవాస దీక్షలో నున్నది కౌసల్యకు గుర్తు వచ్చెను. ముహూర్తము సమీపించుటకు ఇంకను ఆలస్యముండెను. అంత 6 వరకు నా రాముడు ఆకలితో ఎట్లుండును ? అని తలచి యేదైన మిఠాయిగాని నాలుగు పండ్లుగాని తినిపించిన బాగుండునని భావించును. రాముడు వేరే పని మీద వచ్చెనని ఆమెకు తెలియదు.అప్పుడు రాముడు తల్లితో "అమ్మా! తండ్రిగారు నాకువన రాజ్యము ఇచ్చెను. అచట నాకు అన్ని విధముల శుభము జరుగును. నీవు ప్రసన్నురాలపై నేను వన వాసము చేయుటకు అనుజ్ఞ నిమ్ము. పదు నాలుగు సంవత్సరములు వన మందు నివసించి పితృ వాక్యము సత్యము గావించి తిరిగి వచ్చి నీ చరణములు దర్శించెదను. అమ్మా! నీవు దుఃఖించకుము" అనెను. రాముని వచనములు కౌసల్య హృదయ మందు శూలములు గ్రుచ్చినట్లయ్యెను. ఎక్కడి సామ్రాజ్య సింహాసనము! ఎక్కడి వనవాసము ! కౌసల్య మాట్లాడ లేకపోయెన.. మూర్ఛితురాలయి క్రింద పడెను. కొంత సేపటికి తేరుకొని పలు విధముల విలపించి తండ్రి ప్రేమ కంటె తల్లి ప్రేమే గొప్పది. మహారాజు వనవాసము చేయుమనినను నేను వెళ్ళనివ్వను అని అనుకొని ఇది కైకేయి ఆజ్ఞ. ఆపుటకు నాకేమి అధికారమున్నది? ఎందుకనిన కన్న తల్లి కంటె సవతి తల్లి అధికారము ఎక్కువగా నుండును. నేను శ్రీరాముని బలవంతముగ వెళ్ళ నివ్వకున్న, ధర్మము వెళ్ళిపోవును. దానితో అన్నదమ్ములకు పరస్పర విరోధము గలుగును, అని ధర్మ పరాయణురాలైన సాధ్వి కౌసల్య హృదయ మును కఠినముగ చేసికొని కుమారా! తల్లియు తండ్రియు ఆజ్ఞాపించిరి. నీవును అది ధర్మమని తలచితివి. నేను కూడ ధర్మమునకు హాని గలుగనివ్వను. వెళ్ళి ధర్మమును పాలించు". మనెను. పతివ్రతా ధర్మముకౌసల్య హృదయ మందు తుఫాను చెలరేగెను. తనను కూడ రాముని వెంట తీసుకొని వెళ్ళమని అనెను. అప్పుడు రాముడు ఇట్లనెను. "అమ్మా! పతిని పరిత్యజించుట స్త్రీ చేయకూడని క్రూరమైన పని. ఈ ఆలోచనను దూరముగ నుంచుము. నా తండ్రి జీవించి యున్నంత వరకు నీవు ఆయనను సేవించ వలెను. ఇది సనాతన ధర్మము. స్త్రీకి పతియే దైవము, ప్రభువు. మహారాజు మన ఇరువురకు రాజు. భరతుడు కూడ ధర్మాత్ముడు, సదాచారము గలవాడు. అతడు నిన్ను కూడ సేవించును. అమ్మా! నేను వెళ్ళిన తరువాత మహారాజు శోకముతో ప్రాణ త్యాగము చేయకుండ నీవు సర్వదా మహారాజునకు హితవు గలుగు నట్టుగ నుండవలెను. పతికి అనుకూలముగ నుండనిచో అధమగతి ప్రాప్తించును. పతిని సేవించిన స్వర్గ ప్రాప్తి లభించును. ఇది స్త్రీ ధర్మము".కౌసల్య పతివ్రతా శిరోమణియే. పుత్ర ప్రేమచే అట్లనెను. కర్తవ్యమును గ్రహించి పుత్రునికి అనుజ్ఞ నిచ్చెను. సీత శ్రీరాముని వెంట వెళ్ళుటకు సిద్ధపడి నప్పుడు కౌసల్య ఆమెను దగ్గరకు తీసికొని "పుత్రీ! కుల మర్యాదను ఎప్పుడు ఉల్లంఘించకుము. పతియే పరమ దైవము. నేడు నా పుత్రుని తండ్రి వనవాసమును చేయ నియమించెను. అతడు ధనవంతుడు గాని, నిర్ధనుడు గాని అతడే నీకు దైవము. అందువలన ఎప్పుడును తిరస్కరించకుము" అనెను. సీతాదేవికి పతివ్రతా ధర్మము నుపదేశించుట సూర్యునకు దీపము చూపినట్లుండును. అయినను అత్తగారి మాటలు ధర్మార్థ యుక్తముగ భావించి, చేతులు జోడించి "అమ్మా! నేను మీరు ఉపదేశించి నట్లే చేయుదును. ఇట్లే నాకు నా తల్లి దండ్రులు కూడ నుపదేశించిరి. చంద్రుని నుండి వెన్నెల వేరు కాదు. తల్లి తండ్రి సోదరుడు తనయుడు పరిమితమైన సుఖము నిచ్చెదరు. ఇది ఈ లోకములోనే లభించును. కాని పతి మోక్షరూపమైన అపరిమిత సుఖము నిచ్చును. అందువలన పతి సేవయే పరమ ధర్మ" మని పలికెను. శ్రీరాముడు వనవాసమున కేగిన తరువాత దశరథుడు శోకముతో కౌసల్యా భవనమునకు వచ్చెను. అప్పుడు కౌసల్య దుఃఖావేశముతో దశరథుని కొన్ని కఠినమైన మాటలు అనెను. ఆ వెను వెంటనే పశ్చాత్తాపముతో చేతులు జోడించి కాళ్ళపై బడి దశరథుని వేడుకొనెను. "స్వామీ ! నన్ను క్షమింపుడు. నాకు ప్రసన్నులు కండు. నేను పుత్ర వియోగముచే పీడింప బడుచుంటిని. నేను ఈ రోజు పతివ్రతా ధర్మము నుండి భ్రష్టురాల నయితిని. నేను క్షమకు కూడ యోగ్యురాలను కాను. నన్ను మీ దాసిగా భావించి ఉచితమైన శిక్షను విధింపుడు. స్వామీ! నేను ధర్మమును ఎరుగుదును. మీరు సత్యవాదులు. ఇది కూడ నాకు తెలియును". కౌసల్య మాటలు రాజునకు కొంత ఊరట కల్గించెను. కర్తవ్య నిష్టశ్రీరాముని వియోగముతో దశరథుడు అన్నపానములు త్యజించెను. మృత్యు చిహ్నములు కనబడు చుండెను. ఇట్టి స్థితిలో రాజు కౌసల్యతో "శ్రీరామ జననీ ! నీవు ధన్యురాలవు. ఇట్టి స్థితిలో కూడ నీవు ఇంత ఆదర్శముగ మాట్లాడ గలిగితివి. అనగా నీ ధైర్యమునకు సాహసమునకు పాతివ్రత్యమునకు విశ్వాసమునకు నీ ఆదర్శ కర్తవ్య నిష్ణా పాలనకు ధన్యవాదములు. నీవు ధన్యురాలవు''అనెను. శ్రీరాముడు వనవాసమున కేగిన ఆరవ రోజు అర్ధరాత్రి గడచిన తరువాత దశరథుడు ప్రాణ త్యాగము చేసెను.. కోడలిపై ప్రేమసుమంతుడు సీతారామ లక్ష్మణులను వనమున వదలి తిరిగి వచ్చినప్పుడు కౌసల్య పుత్రీ! ఎండకు ఎండిపోయిన కమలమువలె, నలిగిన కలువవలె, ధూళితో కప్పబడిన బంగారము వలె, మేఘములతో కప్పబడిన చంద్రునివలె నున్న నీ ముఖము చూచినప్పుడు నా హృదయ మందు రగిలిన శోకాగ్ని నన్ను కాల్చుచున్నది" అని యేడ్చును.శ్రీరామ భరతుల యందు సమ భావము ప్రజాహితము. కౌసల్యకు శ్రీరాముని యందును, భరతుని యందును సమానమైన ప్రేమ. అన్ని అనర్ధములకు తానే కారణమని విలపించుచున్న భరతుని కౌసల్య హృదయమునకు చేర్చుకొనెను. రాముడు తిరిగి వచ్చెనను భావన కలిగెను. మహారాజు దహన క్రియా నంతరము వసిష్ఠుడు రాజ్య సింహాసనముపై కూర్చుండుమని కోరినప్పుడు భరతుడు. ఒప్పుకొనడు. అప్పుడు కౌసల్య ప్రజల హితము కొరకు భరతునితో "వత్సా! ప్రజాభీష్టము ననుసరించి రాజ్యభారము పూను"మని బోధించును. రాముడు అడవికి వెళ్ళు నప్పుడు కౌసల్యాదేవి "రామునకు రాజ్యమునకు బదులుగా వన రాజ్యము లభించినది. నాదుఃఖమునకు కారణము రాముడు లేనందు వలన గాదు, దశరథ మహారాజునకు భరతునకు ప్రజలకు మిక్కిలి క్లేశము కలుగునని దుఃఖించుచున్నా" నని అనును. ఎంత ఆదర్శమైన పలుకులు ! పుత్ర ప్రేమకౌసల్య పుత్ర వాత్సల్యము ఆదర్శమైనది. ధర్మ రక్షణకు పుత్రుని త్యాగము చేసినది. వనమునకు వెళ్ళు సమయమున పుత్రునితో " కుమారా ! సత్పురుషుల మార్గమును అనుసరించుము. నీవు పాలించు ధర్మము నిన్ను రక్షించును" అని రక్ష కట్టి వనమునకు పంపెను. పుత్ర వియోగ దావానలముతో హృదయము దగ్ధమగుచున్నను తనయుని త్యజించెను. ఇదియే ఆదర్శమైన ప్రేమ. పదునాలుగు సంవత్సరములు నిరంతర వ్యాకులతతో గడపినది. లంకా విజయానంతరము రాముడు అయోధ్యకు వచ్చుచున్నాడను వార్త విని నప్పుడు ఆవు దూడ కొరకు పరుగిడిన విధముగ పరుగిడెను. సుమిత్రా భక్తి హృదయముదశరథుని భార్యలు ఎందరున్నను అందరిలో మహారాణి కౌసల్య పట్ట మహిషి, మహారాజునకు కైకపై అధికమైన ప్రేమ. మిగిలిన వారిలో సుమిత్ర కూడ ప్రధానురాలే. మహారాజు కైక భవన మందే యుండెడి వాడు. సుమిత్ర కౌసల్య చెంతనుండెడిది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సుమిత్ర ఒడిలోనే నిదురించెడివారు. లాలన పాలన అన్నియు సుమిత్రయే చూచెడిది. రాత్రులు నిదుర మేల్కొని యేడ్చు చుండగా కౌసల్య రాముని ఎత్తుకొని సుమిత్ర చెంత కేగి సుమిత్రా! రాముని తీసికొమ్ము. నీ చెంత తప్ప నిదురించడు. చూడుము ఏడ్చి యేడ్చి కనులు ఎంత ఎరుపెక్కినవో!" అని వదలి పెట్టును. రాముడు సుమిత్ర ఎత్తుకొనగనే యేడుపు మానెడి వాడు. రాముడు పెద్దవాడు అయిన తరువాత కూడ నిదుర లేవగానే తండ్రికి తల్లులకు ప్రణామములు చేయువాడు. సర్వకార్యములు సుమిత్రయే నిర్వహించెడిది. అందుకని రాముడు ఎక్కువగా "సుమిత్రా మాత ఎక్కడ" అని అడిగెడి వాడు. లక్ష్మణుడు రాముని వెంట అడవికి వెళ్ళు సమయమున సుమిత్ర లక్ష్మణునితో "కుమారా ! ఇంక నీకు తల్లి వైదేహి, తండ్రి రాముడు. ఎక్కడ రాముడు నివసించిన అదియే అయోధ్య. వారి పాద సేవయే నీకు పరమావధి" అని పలు విధముల ఆజ్ఞాపించి ఆశీర్వదించెను. భరతుడు రాముని దగ్గరకు చిత్రకూటమునకు వెళ్ళినప్పుడు. తల్లులందరు, సీత తల్లి జనకుని భార్య సునయన అందరు కలిసిరి, సునయనకు కైకపై చాల కోపము వచ్చెను. కౌసల్య ఎంత నచ్చ జెప్పినను ఆమె కోపము చల్లారలేదు. అప్పుడు సుమిత్ర "దేవీ! కైక శిక్షను అనుభవించు చున్నది" అని చెప్పి శాంతింప జేసినది. మరొక మారు లంకలో యుద్ధము జరుగుచున్న సమయమున లక్ష్మణుడు రణ భూమి యందు మూర్ఛపోగా, హనుమా నుడు సంజీవినీ పర్వతమును ఎత్తుకొని వచ్చుచుండెను. అప్పుడు భరతుడు శత్రువేమో అనుకొని బాణముతో కొట్టగా హనుమా నుడు క్రిందపడి విషయమును తెలిపెను. అప్పుడు సుమిత్ర “నా పుత్రుడు లక్ష్మణుడు శ్రీరాముని కొరకు రాముని ఎదుటనే యుద్ధము చేయుచు పడిపోయినాడా! ఆహా! నేను ధన్యురాల నయితిని" అని ఆనంద పరవశురాలయ్యెను. మరుక్షణముననే " అయ్యో! శ్రీరాముడు శత్రువుల మధ్యలో ఒంటరిగా పోరాడు చున్నాడు గాబోలు" అని తలచి దుఃఖించెను. శత్రుఘ్నుని కూడ లంకకు పంపవలెనని నిర్ణయించు కొనెను. అప్పుడు వసిష్ఠ మహర్షి వద్దని చెప్పగా ఊరుకొనెను. ఇంతటి ఆదర్శ హృదయము గల సుమిత్ర ధన్యురాలు..కైకేయీ భక్తి హృదయము కైక సరళ స్వభావము గలది, బుద్ధిమతి, వీరనారి. ఒకసారి దశరథుడు శంబరాసురునితో యుద్ధము సలుపుచుండగా రథ చక్రపు ఇరుసు విరిగిపోయెను. అప్పుడు ఆ స్థానములో కైక తన చేయి పెట్టి కాపాడెను. మరొక మారు సారధి హతుడు కాగా తానే సారథ్యము చేసి భర్తను కాపాడెను. దశరథుడు కైక నా వెంట లేకున్న నేను నిశ్చయముగ మరణించెడి వాడను అని అనుకొని కైకను రెండు వరాలు కోరుకొనుమని అనెను. కైక వద్దని అనెను. కాని రాజు బలవంతము చేయగా మరెప్పుడైన వానిని అడుగుదునని అనెను. దశరథుడు కైకను పరిణయమాడు సమయమున కైక తండ్రి కేకయు నరేశునకు కైక కొడుకే రాజ్యమునకు ఉత్తరాధికారి కాగలడని అనెను. ఈ విషయము కైకకు కూడా తెలియును. కాని దశరథుడు తన వంశమునకు ప్రథముడైన కారణమునను, శ్రీరాముని యందు అధికానురాగము చేతను శ్రీరాముని రాజును చేయవలె అని నిశ్చయించుకొనెను. మంధర ఈ విషయం కైకకు చెప్పినప్పుడు రఘువంశ మర్యాద తెలియుట చేతను శ్రీరాముని యందు ప్రేమ చేతను అత్యంతానంద భరితురాలయి దాసీకి కానుకలు ఇచ్చెను. "మంధరా! ఎంత మంచి వార్త చెప్పితివి. నాకు రాముడు భరతుడు. ఇద్దరు ఒకటే. ఇంత మంచి వార్త చెప్పినందుకు నీకేదైన వరము ఇత్తును కోరుకొనుము" అని అనెను.మంధర కైక ఇచ్చిన కానుకలు విసరి కొట్టి కైకకు దుర్బోధ చేసెను. దేవకార్యము నెరవేరుటకు, దుష్ట సంహారము జరుగుటకు దేవతలు సరస్వతీ దేవిని అయోధ్యాపురమునకు వెళ్ళి శ్రీరాము పట్టాభిషేకమునకు విఘ్నము కలిగించు మని కోరిరి. మొదట 'మంధరలో ప్రవేశించి ఆ తరువాత కైకలో ప్రవేశించి పట్టాభిషేక విఘ్నము గావించి ఆ తరువాత స్వర్గ లోకమునకు తిరిగి రమ్ము అని పంపిరి. ఈ పథకము ప్రకారము కైక దశరథుని భరతుని రాజును చేయుమనియు 14 సం॥లు రాముని అరణ్యవాసము పంపుమనియు రెండు వరములు కోరెను. భరతుడు చిత్రకూటమునకు వెళ్ళు సమయమున భరద్వాజ మునిని కలిసెను. అప్పుడు ముని "భరతా! నీవు కైకను ద్వేష దృష్టితో చూడకు. శ్రీరాముని వనవాసము దైవ నిర్ణయముతో జరిగినది. ఇది జగత్కల్యాణము కొరకుగాన ఆమెను ద్వేషించకుము" అని చెప్పెను. భరతుడు రాముని రాజ్యము స్వీకరించుమని అనేక విధముల ప్రాధేయ పడు సమయమున వసిష్ఠుల వారు భరతుని ఏకాంత స్థలమునకు తీసికొని వెళ్ళి " భరతా ! ఒక రహస్యము చెప్పుచున్నాను నిమము. శ్రీరామ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయడు. బ్రహ్మాది దేవతలు ప్రార్ధించగా రావణ సంహారమునకై దరఘునకు పుత్ర రూపమున జన్మించెను. యోగమాయయే జనక నందిని సీత. ఆది శేషుడు లక్ష్మణుడుగా జన్మించి యముని అనుసరించి వచ్చెను. రావణ సంహారము జరుగనున్నది. కావున రాముని వనవాసమునకు వెళ్ళనిమ్ము. కైక వరములు కోరుట, నిష్మరముగ భాషించుట, తదితరములన్నియు దేవతల ప్రేరణతో జరిగినవియే. కావున నీవు రాముని తిరిగి రమ్ము అని కోరకుము" అని చెప్పెను. భరతుడు పాదుకలు తీసికొని వచ్చు సమయములో కైక శ్రీరామునితో ఏకాంతముగ సంభాషించును. నేత్రముల వెంట అశ్రుధారలు కురియు చుండగా రామునితో "రామా ! మాయచే మోహితనగు నేను గొప్ప అనుచిత కార్యము చేసితిని. అందుకు నన్ను క్షమింపుము. సాధు జనులు సర్వదా క్షమా శీలురైయుందురు. దైవ కార్యము నెరవేర్చ వలెనను దృష్టితోనే నీవే నా చేత ఈ పని చేయించితివి. ఇప్పుడు నిన్ను గుర్తించితిని. నీవే దేవతలకు దేవతవు. విశ్వేశ్వరా! అనంతా! నన్ను రక్షింపుము. జగన్నాథా ! మీకు నమస్కారము. ప్రభూ ! మీరే నాకు శరణు. మీరు మీ జ్ఞానాగ్ని రూప ఖడ్గముతో నా పుత్ర, ధనాది స్నేహ బంధములను ఖండింపుడు" అని ప్రార్థించెను. అప్పుడు శ్రీరాముడు నవ్వుచు "మహాభాగినీ ! నీవు చెప్పిన దంతయు నిజమే. నా ప్రేరణ చేతనే దైవ కార్య సిద్ధి కొరకు నీవు అట్లు నూటాడితివి. ఇందులో నీ దోషమేమియు లేదు. ఇంక నీవు వెళ్ళుము. అహర్నిశలు హృదయ మందు నన్ను స్మరింపుము. నా భక్తి చేత శీఘ్రముగ ముక్తి పొందెదవు. నేను సర్వ దర్శకుడను. నాకు అప్రియమైనది, ప్రియమైనది ఏది లేదు. నాకు ఎవరి యందును రాగ ద్వేషము లుండవు. ఎవరు నన్ను ఎట్లు స్మరించెదరో నేను గూడ అట్లే వారిని ధ్యానించెదను. మాతా! నా మాయచే మోహితులైన జనులు నన్ను సాధారణ మనుష్యుడను కొనుచున్నారు. వారు నా వాస్తవ స్వరూపమును ఎరుగరు. నీవు గొప్ప భాగ్యవంతు రాలవు. నీలో సంసార బంధనము తొలగి తత్త్వజ్ఞానము పుట్టెను. నీవు నన్ను స్మరించుచు గృహమందే యుండుము. ఇంక నిన్ను కర్మ బంధనములు బాధించవు” అనెను. శ్రీరాముని మాటల వలనకైక నిర్దోషి అని వెల్లడి అయినది రామ కార్య నిమిత్తము అపకీర్తిని స్వీకరించినది. అనన్య శ్రీరామ భక్తుడైన భరతుని తల్లి తిరస్కార యోగ్యురాలు కాదు. సదా పూజనీయురాలే. సీతా లోకాను గ్రహముఒకసారి సీతా మాత మనస్సులో అయోధ్యా వీధులను చూడ వలెనను కోరిక గలిగినది. శ్రీరామునకు తన కోరికను తెలిపెను. త్రికాల దర్శియగు శ్రీరాముడు, సీత మనస్సు ఉదయించిన ఈ కోరిక ప్రజాహితము కొరకే అని గ్రహించెను. శ్రీరాముడు చిరునవ్వుతో సీతాదేవిని ఎత్తయిన ఒక భవనముపైకి తీసికొని వెళ్ళెను. అచట నుండి అయోధ్యా వీధులన్నియు చక్కగా కనిపించు చుండెను. ఒక గవాక్షము చెంత రత్న సింహాసనముపై సీతా రాములు కూర్చొని అయోధ్యా నగర రమణీయ దృశ్యములను తిలకించుచుండిరి. జన సముదాయము జనకుని గూఢ శ్రీరామ భక్తిఅనేక ఋషులతో కలసి విశ్వామిత్ర మహర్షి మన నగరము నందలి అమ్రు కాననమునకు విచ్చేసి వాడని ప్రజలు చెప్పు కొనుచుండ జనక మహారాజు మంత్రులతోను బ్రాహ్మణులతోను కలసి విశ్వామిత్రుని దర్శించుటకు వెళ్ళెను.జనక మహారాజు విశ్వామిత్రుని చరణములకు ప్రణామ ములు గావించెను. విశ్వామిత్రుడు ప్రేమతో జనకుని తన చెంత కూర్చుండ బెట్టుకొని కుశల ప్రశ్నలడిగెను. శ్రీరామలక్ష్మణులు పుష్పవాటికను దర్శించి తిరిగి వచ్చిరి. తేజోవంతులగు ఆ ఇరువురిని గాంచి అచట నున్న వారందరు లేచి నిలువబడిరి. వారి అద్భుత రూప లావణ్యముల గాంచి అందరు ఆనందపులకితులైరి. వారి వ్రతముల వెంట ఆనందాశ్రువులు స్రవించుచుండెను. వీరిని దర్శించిన విదేహ మహారాజు పరవశించి పోయెను. రామునిపై జనకునికున్న గుప్త ప్రేమ శ్రీరామునకే తెలియును. కొన్ని సంవత్సరముల క్రిందట నారదుడు చెప్పిన మాటలు సత్యమయిన పనిపించెను. అంతకు ముందు నారదుడు జనకునికి జెప్పిన పరమ రహస్య వచనములివి. "భక్తులపై దయతో హృషీకేశుడు దైవ కార్య సిద్ధికి, రావణాది రాక్షసులను వధించుటకు మాయా మానవ రూపముతో అవతరించి "రాము' నామముతో విఖ్యాతిగాంచును. ఆ పరమేశ్వరుడు తన నాలుగు అంశలతో దశరథునకు పుత్రుడై అయోధ్య యందుండెను. ఇచట యోగ మాయయే సీతా రూపమున జన్మించెను. అందువలన ఈ సీతను రఘు నాథునకు ఇచ్చి పాణి గ్రహణము చేయింపుము. పరమాత్మ రాముని భార్య గనుక ఈమెకు తదితరులతో వివాహము కాదు".ధనుర్యజ్ఞానంతరము జనకుడు సీతకు వివాహము గావించి తన జన్మ సఫలమైన దనుకొనెను. వివాహానంతరము దశరథ మహారాజు పుత్రులతోను కోడండ్రలతోను అయోధ్యకు ప్రయాణమయ్యెను. జనకుడు ప్రేమను దాచ లేకపోయెను. నేత్రములు అశ్రుపూరితము లయ్యెను. దశరథుని వంక కొంచెము సేపు, రాముని వైపు కొంచెము సేపు, సీత వైపు కొంచెము సేపు చూడ సాగెను. రాముడు వెళ్ళు చున్నాడను కొనిన తన ప్రాణమే పోవుచున్నట్లుండెను. తిరిగి రండని దశరథుని ప్రాధేయ పడుచుండెను. దశరథుడు ప్రేమతో వారించగా జనకు కు అశ్రు నయనములతో రథము దిగి ప్రణమిల్లెను. అనంతరము రాముని సమీపించి చేతులు జోడించి మాటాడవలెనని అనుకొనుచున్నను ప్రేమ వశముతో మాటాడ లేకుండెను. వాక్కు అవరుద్ధ మగు చుండెను. ఎంతయు ప్రయత్నము మీద నెమ్మదిగా వినమ్రుడై ఇట్లు ప్రార్ధించెను. "రామా ! నేడు నా జన్మ ఫలించెను. సూర్యునివలె ప్రకా శించు మిమ్ములను సీతా సహితులను గాంచు చుంటిని. యోగులు మీ చరణ కమల పరాగ రసికులై భయంకర కాల చక్రమును జయిం చిన వారై సంసార సాగరమును దాటుదురు. మీ నామ సంకీర్తనముతో దేవ గణములు శోకమును, దుఃఖమును జయించుచున్నారు. అట్టి మిమ్ములను శరణు వేడు చుంటిని. నా హృదయ మందున్న మీ చరణములను నేను ఎప్పుడును మరువ కూడదు" అని వేడుకొనగా శ్రీరాముడు జనకుని వచనములకు ప్రేమ పూరితుడై సంతుష్టు డయ్యెను. జనకుని తన తండ్రి దశరథుని వలెను, గురువు విశ్వా మిత్రుని వలెను, కుల గురువు వసిష్ఠుని వలెను భావించి గౌరవించెను అనంతరము జనకుడు భరతుని లక్ష్మణుని శత్రుఘ్నుని కలసి ఆశీర్వదించెను. తరువాత జనకుడు విశ్వామిత్రుని కలసి ఆయన పాదములు పట్టుకొని ఆ పాద ధూళిని నేత్రములకు అద్దుకొని శిరస్సున ధరించెనుశ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై అయోధ్య విడిచి వనవాసమునకేగె ననియు, భరతుడు దుఃఖముతో శ్రీరాముని తిరిగి తెచ్చుటకు చిత్రకూటమునకు వెళ్ళెననియు, వినిన జనకుడు కూడ చిత్ర కూటమునకు వెళ్ళెను. అచట శ్రీరాముని దర్శించి భరతుని భక్తి చూచి వారితో యేమియు చెప్పలేకపోయెను. శ్రీరాముని భరతుని పారస్పరిక ప్రేమ తర్కించనలవి గానిది. జనకుడు శ్రేష్ఠ కర్మ యోగి, ఆదర్శ జ్ఞానులందు అగ్ర గణ్యుడు. ద్వాదశ ప్రధాన భాగవతాచార్యులం దొకడు. జనకుడు ధన్యుడు. ధన్యమైనది అతని గూఢ ప్రేమ. భరతుని శ్రీరామ భక్తిమహా భాగ్యవంతుడైన శ్రీ భరతునకు జయము. జానకీ రాముల చరణ కమలముల మకరందమును గ్రోలు రసిక భ్రమరము భరతుడు. జగత్ భూషణుడు, సూర్య వంశ విభూషణుడు, నృప శిరోమణి శ్రీరామ చంద్రునిపై పూర్ణాను రాగము గలవాడు భరతుడు. జగత్తును భరించి పాలించిన వాడు భరతుడు. భరతుడుజన్మించకున్న ప్రథ్విపై సర్వ ధర్మ భారమును ఎవరు ధరింపగలరు? జడమును చేతనమును, చేతనమును జడమును ఎవరు చేయ గలరు? శ్రీ రాముడే భరతునకు సర్వస్వము. శ్రీ రాముడే తండ్రి, తల్లి, సోదరుడు, బంధువు. జీవన సర్వస్వము రాముడే. శ్రీరాముని వనవాస విషయము వినిన భరతుడు తండ్రి మరణ విషయము మరచిపోయెను. ఈ సర్వానర్థములకు కారణము నేనే అని తలచి స్తంభించి పోయెను. శ్రీ రామునిపై అమితమైన ప్రేమ కారణముననే భరతుడు తన తల్లి అయిన కైకను కటు శబ్ద ములతో తూలనాడి తననే దోషినిగా భావించి పశ్చాత్తాపముతో దుఃఖపడు చుండెను. భరతుని స్వభావ మెరిగిన కౌసల్యా దేవి 'నీవు సదా రామచంద్రుని ప్రేమించువాడవని నాకు తెలియును. శ్రీరాముడు నీకు ప్రాణము కంటె ప్రియమైనవాడు. శ్రీ రామునకు కూడ నీవు ప్రాణము కంటె ప్రియుడవు' అని పలుకుచు ఓదాగిను అనంతరము వామదేవ వసిష్ఠులు భరతుని ఓదార్చిరి, నుంచి ముహూర్తమున రాజ సభ నేర్పాటు గావించి మంత్రులను, సభాసదులను, భరతుని, కౌసల్యాదులను పిలిపించి భరతునితో “రాజ్యము స్వీకరింపు" మని కోరిరి. అప్పుడు భరతుడు వారితో వినయముగా "నా తండ్రి స్వర్గమున కేగెను. శ్రీ సీతారాములు వన మందుండిరి. ఇట్టి సమయమున మీరు నా శుభమును కోరుచుంటిరా? శ్రీరాముడు తప్ప నా మనో భావమును గ్రహించువారు ఎవరు ? ప్రాతః కాలముననే శ్రీరాముని చెంతకేగుదు" నని నిశ్చయముగ పలికెను. “సీతాపతి సేవయే నాకు శుభో' మనెను. భరతుడు వనమునకు వెళ్ళు సమయమున నిషాదుని కలసి వానితో "నేను మహాపాపిని. విధాత మా వంశ కలంకమునకే నన్ను పుట్టించి నట్లున్నది" అని బాధ పడుచుండగా నిషాదుడు భరతుని ఓదార్చుచు “శ్రీరామ ప్రభువు మిమ్ములను పదే పదే గుర్తు చేసి కొనుచు ప్రశంసించుచు గడిపెను. మీ కంటె అతి ప్రియమైన వారు శ్రీరామునకు లేరు. ఇది ప్రమాణము చేసి చెప్పు చుంటే” ననెను. అనంతరము భరతుడు భరద్వాజ మునిని కలిసెను. మునికి ప్రణామ మాచరించి "నా తల్లి కైక చేతలు నాకు తెలిసినవి కావు. జనులు నన్ను నీచుడను కొందురు. అందుకు బాధపడుట లేదు. పరలోక భ్రష్టుడ నైనందుకు బాధలేదు. తండ్రి మరణము కూడ నాకు శోకము గలిగించుట లేదు. అతడు పుణ్యాత్ముడు రామ లక్ష్మణులను పుత్రులుగా పొంద గలిగినాడు. సీతా రామలక్ష్మణులు ముని వేషములతో కాళ్ళకు చెప్పులు కూడ లేకుండ వనము లందు తిరుగుచున్నారు. నార బట్టలు ధరించి ఫలములు భుజించుచు నేలపై దర్భలను, ఆకులను పరచుకొని నిదుర పోవుచున్నారు. వృక్షముల క్రింద నివాసము చేయుచు నిత్యము ఎండ వానగాలులను సహించు చున్నారు. అదియే నాకు దుఃఖము గలిగించు చున్నది. నా హృదయము సంతాపాగ్నిలో నిరంతరము కాలిపోవుచున్నది. నాకు పగలు ఆకలి వేయుట లేదు. రాత్రులు నిదుర కూడ వచ్చుట లేదు. నేను ధర్మార్థ కామ మోక్షము లలో దేనిని కోరుట లేదు. జన్మ జన్మల యందు శ్రీరాముని చరణములపై ప్రేమనే వరముగా కోరుకొనెదను. ఇంకేదియు నాశించుట లేదు” అని భరతుడు చెప్పగా భరద్వాజ ముని “భరతా! ధన్యుడవు నీ కీర్తితో జగత్తునే జయించితివి'' అనుచు ప్రేమ మగ్నుడయ్యెను. భరతుడు శ్రీరాముని విరోధియని లక్ష్మణుడు భ్రమ పడెను. అప్పుడు రాముడు "లక్ష్మణా! వినుము. భరతుని వంటి ఉత్తమ పురుషుడు బ్రహ్మ సృష్టి యందు ఉన్నట్లు వినలేదు, కనలేదు. అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించిన వాడయినను రాజు గర్వము లేనివాడు. నేను గురువు వసిష్ఠునిపై ప్రమాణము చేసియు తండ్రి చరణముల సాక్షిగను శపథము చేసి చెప్పుచుంటిని. విశ్వ మందెక్కడను భరతుని వంటి సోదరుడు లేడు" అని చెప్పెను. (రామ చరిత మానసము) ఊర్మిళా లక్ష్మణుల శ్రీరామ భక్తిలక్ష్మణుడు శ్రీరాముని సేవించుటకు అరణ్య వాసమునకు వెళ్ళుచుండెను. ఊర్మిళ కూడ లక్ష్మణుని వెంట వెళ్ళిన రాముని చుటకు అంతరాయము గలుగును. రాముని సేవించుటయే లక్ష్మణుని ధర్మము. ఆ ధర్మము కాపాడుటకు భర్తకు ఊర్మిళ సహకరించినది. అదియును గాక ఇంద్రజిత్తునకు ఒక వరముండెను. 12 సం॥లు కంద మూలఫలములను భుజింపుచు, నిద్రను త్యజించి అఖండ బ్రహ్మచర్యమును పాటించు మహాపురుషుని చేతిలో. మేఘనాథుడు మరణించునని. ఇందువలన ఊర్మిళ అయోధ్యయందే యుండెను. మహావ్రతమును పాటించుచు లక్ష్మణుడు రాముని వెంట వెళ్ళెను.ఈ విషయ మంతయు లక్ష్మణుడు చెప్పుట వలన ఊర్మిళ మౌనముగా పాతివ్రత్య ధర్మమును పాటించెను. సతి ధర్మ రక్షణలో సహాయపడుట పత్నీ ధర్మము గనుక మారు మాటాడలేదు. వివాహమై జనకపురి నుండి వచ్చిన తరువాత 12 సం॥లు లక్ష్మణుని అనుసరించి యున్నది ఊర్మిళ. సుమిత్ర వలెనే ఊర్మిళ కూడ త్యాగము చేసి తన ధర్మమును నెరవేర్చినది. మరొక విషయము శ్రీరాముడు స్వతంత్రుడు. అందు వలన జానకిని తన వెంట తీసికొని వెళ్ళినాడు. సేవా పరాయణుడగు లక్ష్మణుడు పరతంత్రుడు. ఊర్మిళను తీసికొని వెళ్ళుట అనుచితము వనవాస సమయమున లక్ష్మణుడు శ్రీ సీతారాములను అన్ని విధముల సేవించుచు వీరాసనముతో కూర్చుండి మనస్సు రాముని యందు నిలిపి రామ నామము జపించుచు జాగరూకుడై యుండెడివాడు. రావణుడు సీతను ఆకాశ మార్గమున తీసికొని వెళ్ళు చుండగా నగల మూట ఋష్యమూక పర్వతముపై నున్న వానరుల మధ్యపడ వేసెను. రామలక్ష్మణులు సీతను వెదకుచు వచ్చునప్పుడు హనుమానుని ప్రేరణతో సుగ్రీవుని చెంతకు వెళ్ళిరి. అప్పుడు సుగ్రీవుడు ఆ నగల మూటను రాముని ముందు ఉంచెను. రాము డానగలను గుర్తించమని లక్ష్మణునికి చెప్పును. అప్పుడు లక్ష్మణుడు "స్వామీ! నేను ప్రతి నిత్యము చరణములకు వందనము చేయు నప్పుడు ఆ తల్లి నూపురములనే దర్శించెడి వాడను. అందువలన వాటిని మాత్రమే నేను గుర్తించ గలను " అని అనెను. లక్ష్మణుని సేవా ధర్మము ధన్యమైనది. శ్రీరాముని విడచి యుండని వాడు, రామ నామము తప్ప మరేదియు తెలియని వాడు లక్ష్మణస్వామి. శత్రుఘ్నుని శ్రీరామ భక్తిప్రపంచ మందు అనేక విధములైన భక్తులున్నారు. అందరిలో శత్రుఘ్నుని భక్తి నిలక్షణమైనది. ఇతడు మూక కర్మ యోగి. ఏమి చెప్పువాడు కాదు. ఏమి అడుగువాడు కాదు. భగవానుని అనుసరిం చుట, భక్తితో సేవించుట, భక్తితో వెన్నంటి యుండుట, భరతుని సేవించుట ఇతని ధర్మములు. భరతుని విడచి యుండు వాడు. కాదు. అందుచేతనే వసిష్ఠుడు భరతునితో "రామలక్ష్మణులు అయోధ్య వచ్చినచో మీ ఇరువురు వనవాసము చేయుడు” అని చెప్పును. భరతుడు శత్రుఘ్నుని అడుగకుండగనే వసిష్ఠుని మాటకు అంగీకారము తెలుపును. శత్రుఘ్నుడు తనను విడచి యుండడనిభరతునకు తెలియును. చిత్రకూటము నుండి తిరిగి వచ్చినప్పుడు భరతుడు నంది గ్రామ మందు రామ లక్ష్మణుల వలెనే తపస్వియై యుండెను. తల్లులను రాజ పరివారమును సేవకులను సంరక్షించు భారము భరతుడు శత్రుఘ్నునకు అప్ప జెప్పెను. హృదయ మందు దుఃఖాగ్ని రగులు చుండెను. తాను కూడ వస్త్ర భూషణములు త్యజించిన తపస్వియైన తల్లులు అది చూచి భరించలేరని అందరి కొరకు దుఃఖమును హృదయ మందే నిలిసెను. మనస్సు నందు భగవానుని నిలిపి 14 సం||లు ప్రసన్న ముద్ర దాల్చుట అన్నిటి కంటే కఠోరమైన తపస్సు. రామ రాజ్యాభిషేకా నంతరము శత్రుఘ్నుడు రఘునాథుని ఆజ్ఞతో లవణాసురుని వధించి మధురాపురమును నిర్మించెను. కొంత కాలము తరువాత ఆ రాజ్యమును తన ఇరువురు కుమారులకు అప్ప జెప్పి శ్రీరాముని వద్దకు వచ్చెను. భరతుని ఆజ్ఞాబద్దుడై యుండెను. హనుమంతుని శ్రీరామ భక్తియత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృత మస్త కాంజలిమ్ | బాష్ప వారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసానక్తమ్ ॥ శంకర భగవానుని అంశతో వాయుదేవుని వలన కపిరాజు కేసరి పత్ని అంజనకు హనుమానుడుద్భవించెను. మర్యాదా పురుషోత్తముడగు శ్రీరాముని శంకరుడు స్వరూ పముతో సేవించలేడు గనుక తన ఏకాదశ రుద్ర రూపములను ఈ విధముగ వానర రూపములతో అవతరింప జేసెను. జన్మించిన కొద్ది సమయమునకే హనుమానుడు ఉదయించు సూర్యుని ఎఱ్ఱని ఫలమని తలచి దానిని మ్రింగుటకు ఆకాశము వైపు పరుగిడెను. ఆ దినము సూర్యగ్రహణ మగుటచే రాహువు మరొకరు సూర్యుని పట్టుకొనుటకు వచ్చుట చూచి సూర్యుని విడచి ఆ వచ్చువారిని పట్టుకొనుటకు వచ్చెను. వాయు పుత్రుడు రాహువును మ్రింగుటకు వెంటపడెను. రాహువు భయముతో ఇంద్రుని శరణు వేడెను. ఐరావతమును వచ్చుచున్న ఇంద్రుని చూచిన పవన కుమారుడు ఐరావతమును పెద్ద తెల్లని పండుగా భావించి దానిని పట్టుకొన బోయెను. ఇంద్రుడు భయపడి వజ్రాయుధముతో కొట్టెను. అప్పుడు హనుమానుని దవడకు గాయమగుటచే వంకర పోయెను. ఇందు వలననే మారుతి హనుమానుడుగా పిలువబడుచున్నాడు. వజ్రఘాతముతో మారుతి మూర్ఛపోయి క్రిందపడెను. పుత్రుడు మూర్ఛపోవుట గాంచిన వాయుదేవుడు వాయువును స్తంభింప జేసెను. శ్వాస ఆడకపోవుటచే వ్యాకులపడి సమస్త దేవతలు హనుమానునకు అమరత్వమొసగి అనేక వరము లిచ్చి వాయు దేవుని సంతుష్ట పరిచిరి. హనుమానుడు జాతి స్వభావముతో చంచలుడై ఋషుల ఆశ్రమములలోని వృక్షములను పడగొట్టుచు, ఆశ్రమ వస్తువులను అస్తవ్యస్తము గావించు చుండెను. అప్పుడు ఋషులు ఇతనిని "నీవు నీ బలమును మరచెదవు. ఎవరైనను నీ బలమును నీకు గుర్తు చేసిన మరల నీ బలమును నీవు పొందెదవు" అని శపించిరి. అప్పటి నుండి సామాన్య వానరునిగా మెలగసాగెను. తల్లి ఆజ్ఞానుసారము | సూర్యనారాయణుని చెంతకేగి వేద వేదాంగ ప్రభృతులు సమస్త శాస్త్రములు కళలు అధ్యయనము చేసెను. తరువాత కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుని వెంట నుండసాగెను. సుగ్రీవుడు మారుతిని తన సహాయ మంత్రిగా నియమించెను. వాలి సుగ్రీవుని తరిమి వెళ్ళగొట్టి నప్పుడును, హనుమానుడు సుగ్రీవునితోనే ఋష్యమూక పర్వతముపై నుండెను. అంజనాదేవి పదే పదే రామచరిత్రను హనుమానునకు పసితనము నుండియే బోధించెడిది. తరువాత వేదములలోను, పురాణములలోను నున్న శ్రీరామ కథను అధ్యయనము చేసెడివాడు. కిష్కింధకు వచ్చిన తరువాత శ్రీరాముడు అయోధ్యలో అవతరించెనను విషయము తెలిసినది. అప్పటి నుండి తన స్వామిని దర్శించుటకు ఎదురు చూచు చుండెను. "నిరంతరము భగవానుని కృపకు ఎదురు చూచుచు, ప్రారబ్ధ కర్మల వలన సమకూడిన సుఖ దుఃఖములను సంతోషముగ అనుభవించుచు హృదయ పూర్వకముగ సాష్టాంగ ప్రణామము చేయును. హృదయ మందు భగవానుని స్మరించుచు, వాక్కుతో భగవన్నామ సంకీర్తన గావించుచుండెను. తనువుతో భగవానుని పూజించువారు ముక్తి పదమునకు అధికారులగుదురు” అని భాగవతములో గలదు. శ్రీ హనుమానుడు జన్మతోనే మాయా బంధన ముక్తుడయ్యెను. అహర్నిశలు శ్రీరామునే స్మరించు చుండెను. సీతను వెదకుచు రామలక్ష్మణులు ఋష్యమూకమునకు వచ్చిరి. వారిని చూచిన సుగ్రీవుడు, వాలి తనను వధింపుమని వీరిని పంపె నేమోయని శంకించెను. వారిని పరిచయము చేసికొని రమ్మని హనుమానుని పంపెను. హనుమానుడు విప్ర వేషము ధరించి వెళ్ళి వారిని పరిచ యము చేసికొని శ్రీరాముడు తన స్వామియే యని గుర్తించి చరణములపై బడి రోదించు చుండ శ్రీరాముడు లేపి హృదయ మున చేర్చుకొనెను. అప్పటి నుండి హనుమానుడు శ్రీ అవధేశ కుమారుని చరణముల సమీపముననే యుండెను. హనుమానుడు ప్రార్ధించగా శ్రీరాముడు సుగ్రీవునితో మిత్రత్వము పొంది వాలిని సంహరించి సుగ్రీవునకు కిష్కంధా రాజ్యమిచ్చెను. రాజ్య భోగముతో సుగ్రీవుడ ప్రమత్తుడగుట గాంచి, హనుమానుడు వానిని సీతాన్వేషణకు అప్రమత్తుని గావించెను. పవన కుమారుడే వానరులందరిని ఒక చోటికి చేర్చెను. శ్రీరాముడు ఇతనికే ముద్రిక నిచ్చెను. "నూరు యోజనముల సముద్రము దాటుటెట్లు?'' అను ప్రశ్న వచ్చినప్పుడు జాంబవంతుడు హనుమానునకు అతని బలమును గుర్తుకు దెచ్చి "మీరు అవతరించినదే రామ కార్యము నెరవేర్చుటకు" అని చెప్పెను. అప్పుడు తన శక్తిని గ్రహించిన వాడై కేసరీ కిశోరము లేచి నిలువబడెను. దేవతలు పంపగా వచ్చిన నాగమాత సురసను సంతుష్ట పరచి, సముద్ర మందు దాగియున్న సింహికా రాక్షసిని వధించి, హనుమానుడు లంకా నగరము చేరెను. ద్వారపాలిక లంకిణిని ఒక ముష్టి ఘాతముతో సరి చేసి, చిన్న రూపము ధరించి రాత్రి సమయమున లంక యందు ప్రవేశించెను. అశోక వాటిక యందు జానకిని దర్శించి, ధైర్యము చెప్పి అశోక వనమును విధ్వంసము గావించెను. రావణుడు పంపగా వచ్చిన రాక్షసులను, రావణ పుత్రుడు అక్షయ కుమారుని సంహరించెను. మేఘనాథుడు బ్రహ్మాస్త్రముతో బంధించి రాజ సభకు తీసికొని వెళ్ళెను. అచట హనుమానుడు రావణునితో "అభిమానము వదలి - శ్రీరామ భగవానుని శరణు వేడు"మనెను. రావణుని ఆజ్ఞతో హనుమానుని తోకకు నిప్పు ముట్టించిరి. ఆ అగ్నితోనే హనుమానుడు లంకా దహనము గావించెను. తరువాత సీత చెంత కేగి చిహ్నముగా నొసగిన చూడామణిని తీసికొని శ్రీరాముని చెంతకు తిరిగి వచ్చెను. రాముడు యుద్ధమునకు బయలుదేరి సముద్రముపై సేతు నిర్మాణము గావించెను. సంగ్రామ మందు రావణుడు సమస్తాను. చరులు బాంధవులతో మరణించెను. యుద్ధ మందు హనుమా నుడు అందరి కంటె ఎక్కువగా తన పరాక్రమమును చూపెను. తన హుంకారముతో రాక్షసులను కంపింప జేసెను. మేఘనాథుని శక్తితో మూర్చపోయిన రామలక్ష్మణులను, మార్గ మందు అడ్డు వచ్చిన దుష్టుడగు కాలనేమిని వధించి ద్రోణాచలమును పెళ్ళగించి తెచ్చి సంజీవనీ ఓషధితో రామ లక్ష్మణులను మూర్ఛ నుండి తేర్చెను. రావణుడు మాయతో యుద్ధ భూమి నుండి రామ హనుమానుడు ఆజన్మ నైష్టిక బ్రహ్మచారి, మహావ్యాకరణ పండితుడు, వేదజ్ఞుడు, జ్ఞాన శిరోమణి, గొప్ప విచార శీలుడు, తీక్ష బుద్ధి గలవాడు, అతుల పరాక్రమవంతుడు, సంగీత నిపుణుడు, గాయకుడు కూడ.. ఒకసారి దేవ దానవ ఋషి సమ్మేళనములో జలాశయ తీరమున శంకర భగవానుడు, దేవర్షి నారదాదులు గానము చేయు చుండిరి. అప్పుడు హనుమానుడు మధుర స్వరముతో సుందరమైన గానము ప్రారంభించెను. అప్పుడు అందరు తమ తమ గానముల నాపి, పరవశులై మౌనముగా వినసాగిరి. అప్పుడు హనుమా నుడొక్కడే గానము చేయుచుండెను. (పద్మ పురాణము) ఎప్పటి వరకు రామ కథ ఉండునో అప్పటి వరకు హనుమా నుడు ఈ పృథ్వీపై నుండునట్లు స్వయముగ శ్రీరామ ప్రభువు వలన వరము పొందెను. శ్రీరాముని అశ్వమేధ యజ్ఞ మందు అశ్వరక్షా సమయమున అనేక మహా సంగ్రామములు జరిగెను. వానిలో హనుమానుడు పరాక్రమముతో సర్వ విజయి అయ్యెను. మహా భారత మందు అర్జునుని రథ ధ్వజముపై కూర్చుండెను. అందువలననే అర్జునుని రథము నెవ్వరు వెనుకకు మళ్ళించ లేకపోయిరి. ఒకసారి గరుడ భీమార్జునుల అభిమానమును తొలగించెను. హనుమానుడు తన వజ్ర నఖములతో పర్వత శిలపై రామచరిత్ర కావ్యమును వ్రాసెను. దానిని గాంచిన వాల్మీకి మహర్షికి దుఃఖము గలిగెను. ఒక వేళ ఈ కావ్యము లోక మందు ప్రఖ్యాతి గాంచిన, నా ఆది కావ్యమునకు ఆదరము లభించదను కొనెను. అప్పుడు ఋషిని సంతుష్ట పరచుటకు హనుమానుడా శిలను సముద్రమున వేసెను. నిజమైన భక్తునిలో అభిమాన చర్యములుండవు. హనుకూనుడు తన ప్రభువు పావన యశస్సును లోకములో గానము చేయును. శ్రీరామ కథా శ్రవణము, రామ నాను కీర్తన హనుమానునకు అవిస్రియమైనవి. రామ నామ కీర్తన గాని, తాను కథగాని యుండు చోటికి హనుమానుడు గుప్త రూపముతో వెళ్ళి ప్రారంభము నుండి చివరి వరకు చేతులు జోడించి నిలువబడి యుండును. అట్టి అతులనీయ శ్రీరామ భక్తుని స్థానన సద కమలములకు అనంత నమస్కారములు. శ్రీరామ జయ రామ జయ జయ రామలంకా విజయా నంతరము శ్రీరాముడు మహాసభ యందుండగా దేవర్షి నారదుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు అనేక ఋషి గణములు సమావేశమై యుండిరి. అట్టి సమయమున నారదుడు ఋషులను "శ్రీరామ నామము (భగవానుని నామము), శ్రీరాముడు (స్వయం భగవానుడు) వీనిలో నేది శ్రేష్ఠమైనది ?" అని ప్రశ్నించెను. అందరును తర్కించు. గు ఏమియును చెప్పకుండిరి. అప్పుడు నారదుడు "నేను నిర్ణయిం చితిని. నామమే శ్రేష్ఠమైనది" అని చెప్పి అది అప్పుడే ఋజువు చేయవలెనని తలచి హనుమానుని పిలచి "మహావీరా ! నీవు శ్రీరామునకు సమస్త ఋషులకు నమస్కారము చేయుము. కాని విశ్వామిత్రునకు మాత్రము చేయకుము" అని చెప్పెను హనుమానుడు అథ్లె చేసెను. శ్రీరాముని వర దానముమీరు శరభంగ ముని బ్రహ్మ లోకమునకు వెళ్ళిన తరువాత మునుల సముదాయము శ్రీరాముని చెంత కేగి "రఘునందనా! మీరు ఇక్ష్వాకు వంశీయులకు సమస్త భూమండలమునకు ప్రభువులు. ఇంద్రుడు దేవతలకు రక్షకుడైనట్లు మనుష్య లోకమునకు రక్షకులు. మీ యశస్సు పరాక్రమము త్రిలోకములందును ఖ్యాతి గాంచెను. పిత్రాజ్ఞా పాలన వ్రతము, సత్యము ధర్మములు మూర్తీ భవించిన మహాత్ములు. మేము స్వార్ధముతో మిమ్ము ప్రార్ధించుటకు వచ్చియున్నాము. ఇందుకు మమ్ములను క్షమింపుడు.స్వామీ ! రాజు ప్రజల ఆదాయ మందు ఆరవ భాగము పన్ను రూపమున గ్రహించుచున్నాడు. అందువలన బిడ్డల వలె ప్రజలను రక్షించుకున్న అధర్మము చేసినట్లగును. శ్రీరామా ! భూపాలుడు ప్రజా రక్షకుడై తన రాజ్య మందు నివసించు ప్రజలను ప్రాణ సమానులుగను, అంత కంటె అధికముగను, ప్రియ పుత్రులతో సమానముగను, సదా సావధానుడై రక్షించ వలెను. అట్లుచేసిన రాజు అనేక సంవత్సరములు రాజ్యము పాలించి అక్షయ కీర్తిని పొందును. అంతమున బ్రహ్మలోకమున విశేషముగ సత్కరింపబడును. చేయు రాజ్య మందు మునులు కందమూల ఫలములను ఆహార ముగ గ్రహించుచు ఉత్తమమైన ధర్మమును అనుష్ఠానము చుందురు. అందులో నాలుగవ భాగము ధర్మానుసారముగ ప్రజలను రక్షించు ఆ రాజునకు చెందును. శ్రీరామా ! ఈ వన మందు నివసించు వాన ప్రస్థులగు మహాత్ముల యందు అధికముగ బ్రాహ్మణులున్నారు. వారి రక్షకులు మీరే. రాక్షసులచే సంహరింప బడిన మునుల ఎముకల ప్రోవులు గుట్టలుగ పడియున్నవి. వీరిలో పంపా సరోవర మందుండు వారు కొందరు, తుంగభద్రా నదీ తీర నివాసులు కొందరు, మందాకినీ తీర వాసులు కొందరు, చిత్రకూట పర్వత ప్రాంత మందుండు వారు కొందరు నున్నారు. అందువలన ఈ రాక్షసుల బారి నుండి మమ్ము రక్షించె దవని నీ శరణు జొచ్చితిమి. శ్రీరామా ! నీవు శరణాగత వత్సలు డవు. మమ్ము రక్షింపుము. ఈ భూమండల మందు మిమ్ములను మించిన వీరులు మరొకరు లేరు. ఈ రాక్షసుల బారి నుండి మమ్ము రక్షింపుడు" అని మునులు ప్రార్ధించిరి. అప్పుడు రాముడు "ముని వర్యులారా! మీరు నన్ను ప్రార్ధించ కూడదు. నేను మీ ఆజ్ఞా పాలకుడను. రాక్షసులను మీ సంహరించి మిమ్ము రక్షించుట కొరకే నేను తండ్రి ఆజ్ఞను పాలించి ఈ వనమునకు వచ్చితిని. మీ ప్రయోజన సిద్ధి కొరకే దేవతలు నన్ను ఇచటికి పంపించిరి. మీ సేవా భాగ్యముతో నేను ధన్యుడనైతిని. తపోధనులారా ! మునులకు శత్రువులైన ఆ రాక్షసుల నందరిని సంహరించెదను. సోదర సహితముగ నా పరాక్రమమును దర్శించెదరు" అని తపోధనులకు వరమొసగెను. కాకభుశుండి శ్రీరామ భక్తిలంకలో యుద్ధము జరుగు చుండగా శ్రీరాముని, మేఘ నాథుడు నాగపాశముతో బంధించెను. తన స్వామిని బంధ విముక్తునిగావించుటకు నారదుడు గరుడుని పంపెను. గరుడుడు నాగపాశమును తొలగించెను. కాని గరుడునకు ఒక సందేహము “తుచ్ఛుడైన మేఘనాథుడు సర్వ సమర్థుడైన భగవానుని ఎట్లు బంధించెను ?" అని. గరుడుడు నారదుని సమీపించి తన సందేహమడిగెను. నారదుడు “గరుడా ! నీ హృదయ మందు మహామోహము ఉత్పన్నమయ్యెను. నీవు బ్రహ్మ కడకేగి వాని నడుగు'' మనెను. బ్రహ్మ చెంతకేగగా అతడు శంకరుని వద్దకు పంపెను. శంకరుడు "నీ సందేహము పోవలెననిన నీవు కొంత కాలము సత్సంగము చేయవలెను. మహాత్ముడైన కాకభుశుండి దగ్గరకు వెళ్ళుము. అతడు శ్రీ రామ భక్తుడు. అతడు సదా భగవానుని లీలా గాథలను చెప్పుచుండును. అతనికడ వయోవృద్ధులైన రాజహంసలు, శ్రేష్ఠమైన పక్షులు కథను వినుచుండును. నీవు అచటికి వెళ్ళి ప్రభుని చరిత్ర వినుము. అచట నీ భ్రమ తొలగిపోవును" అని చెప్పెను. శంకరుని ఆజ్ఞాను సారము గరుడుడు నీలాచలముపై నున్న కాక భుశుండి. ఆశ్రమమునకు వెళ్ళెను. హరికథ చెప్పుమని కోరగా పరమపావన రామ కథను సంపూర్ణముగ వినిపించెను. గరుడుడు కోరగా కాకభుశుండి తన కథను ఇట్లు చెప్పెను. “పూర్వ కాలమున కలియుగ మందు అయోధ్యలో శూద్ర కులమందు జన్మించితిని. ఒకసారి కరువు రాగా అయోధ్య విడిచి ఉజ్జయినికి వెళ్ళితిని. అచట శంకర భగవానుని ఉపాసకుడైన బ్రాహ్మణ సాధువుండెను. అతడు నాకు శివ మంత్రమును ఉపదేశించెను. నేను శివ భక్తుడనైతిని. కాని రాముడన్నను, కృష్ణుడన్నను నాలో ఈర్ష్య పెరిగినది. నా గురువు ఎంతయు బాధపడుచు "శంకరుడు సదా రామ నామమును జపించును. నీకు ఈ ద్వేషము పనికిరాదు" అని ఎన్ని మారులు చెప్పినను నాలో ఆ ద్వేషము పోలేదు. ఒకసారి శంకరుని మందిర మందు శివ నామము జపించు చుంటిని ఆ సమయమున నా గురువులు అచటికి వచ్చిరి. అహంకా రముతో నేను లేచి నిలబడలేదు, నమస్కారము చేయలేదు. అయినను నా గురువు సహించెను. కానీ శంకర భగవానుడు నన్ను క్షమించ లేదు. ఆకాశవాణి "ఇతడు సహస్త్ర, జన్మలెత్తు" నని శపించెను. దయగల నా గురువు అయ్యో అనుచు లేచి నిలువబడి ఈశ్వరుని ప్రార్ధించెను. గురుదేవుని ప్రార్ధనతో సంతుష్టుడైన ఉమానాథుడు "నా శాపము వ్యర్ధము కాదు. అధమ యోని యందు ఒక వెయ్యి మారులు అవశ్యము జన్మింప వలసినదే. నా దయ వలన ఇతనికి సర్వము గుర్తుండును. అంతిమ జన్మ యందు ఇతడు బ్రాహ్మణ కులమందు జన్మించును. అప్పుడు శ్రీరాముని చరణములపై ప్రీతి యేర్పడును" అని పలికెను. శంకురుని శాపానుసారము అనేక జన్మ లెత్తి చివరకు బ్రాహ్మణ కులమున జన్మించితిని. పూర్వ జన్మ స్మృతితో శ్రీరాముని యందు భక్తి యేర్పడెను. కొంత కాలము గడిచిన తరువాత నా తల్లి దండ్రులు గతించిరి. ఇల్లు విడచి వనమునకు వెళ్ళితిని. అచటికి వచ్చు ఋషులకు, మునులకు నేను రాఘవేంద్రుని గుణములను గానము చేయుచు వినిపించు చుంటిని. నెమ్మది నెమ్మదిగా నాకు శ్రీరాముని దర్శించవలెనను కోరిక అధికమయ్యెను. ఎవరిని అడిగిన భగవానుడు సర్వవ్యాపకుడు, నిర్గుణుడు, నిరాకారుడు అని ఉపదేశించు చుండిరి. కాని నాకు సంతోషము గలుగుట లేదు. రాఘవేంద్రుని దర్శించ వలెనను వ్యాకుల పడుచుంటిని. అతని చరణములకు ప్రణామము జేసి "సగుణ సాకార భగవానుని దర్శించు ఉపాయము చెప్పు" మని అడిగితిని. అతడును నిర్గుణ నిరాకార బహ్మనే ప్రతిపాదించు చుండ నేను దానిని ఖండించుచు సగుణ సాకారుని సమర్ధించు చుంటిని. మహర్షి ఎన్ని మారులు చెప్పినను విననైతి. మహర్షి కోపముతో కాకిని కమ్మని శపించెను. వెంటనే నేను ఈ రూపము ధరించితిని. మహర్షి వెను వెంటనే పశ్చత్తాపము జెంది నన్ను పిలచి శ్రీరాముని బాలరూపమును, శ్రీరామ మంత్రమును నాకు ప్రసాదించెను. ప్రేమతో నాశిరస్సు నిమురుచు ' నీ హృదయ మందు శ్రీరామునిపై భక్తి ఎల్లప్పుడుండును. శ్రీరాముడు కూడ నిన్ను సదా ప్రేమించును. జ్ఞాన వైరాగ్యాది సమస్త శుభగుణములు నీలో సదా నివాస ముండును. ఇచ్చాను సారముగ రూపము ధరించెదవు. మృత్యువు కూడ నీ ఇచ్చాను సారమే జరుగును. నీ మనోవాంఛ నెరవేరును. నీవు ఏ ఆశ్రమ మందున్నను అచటికి ఒక యోజన దూరము వరకు అజ్ఞానము ప్రవేశించలేదు' అని పలికెను. గురుని అనుగ్రహముతో కృతార్ధుడనైతిని. గురువునకు వందనములు సమర్పించి ఇచటికి వచ్చితిని. ఇచట 27 కల్పములు గడిచిపోయినవి. భగవానుడు అవతారములు ఎత్తినప్పుడు అయోధ్యకు వెళ్ళి అతనిని 5 సంవత్సరముల బాలకుని వరకు బాలలీలలు గాంచుచు భువన మోహన రూపమును దర్శించుకు కృతార్థుడనగు చుందును. తరువాత శిశు రూపమును హృదయ మున ధరించి తిరిగి ఈ ఆశ్రమమునకు వచ్చి శ్రీరాముని ధ్యానిం చుచు వాని లీలా కథలను చెప్పుచుందును. ఈ రాజహంసలు ఎంతో ఆదరముగ వినును" అని గరుడునకు చెప్పెను. శంకర భగవానుడు స్వయముగ పార్వతీ మాతకు కాకభు శుండి ఆశ్రమమును గురించి వర్ణించి చెప్పెను. ఆది శంకరాచార్యుల శ్రీరామ భక్తి
ఆది శంకరాచార్యులు సాక్షాత్ శివ భగవానుని అవతారము. ఇతడు యోగ జ్ఞాన వైరాగ్య భక్తి స్వరూపుడు. ఇతడు కొద్ది కాలములోనే బౌద్ధులను, జైనులను మొదలగు వారిని ఓడించి భారతదేశమున నాలుగు వైపుల నాలుగు మఠములను, ఉప మఠాదులను నిర్మించి సమస్త దేశ మందు సత్యసనాతన ధర్మమును స్థాపించెను. ఉపనిషత్తులకు, గీత, వేదాంత దర్శనాదులకు అద్భుతమైన భాష్యమును రచించి తన తీవ్ర ప్రతిభా దివ్య విజ్ఞానములతో సమస్త ప్రపంచమును ఆశ్చర్యపరచెను. శక్తి ఉపాసనపై సౌందర్య లహరి, నృసింహ ఉపాసనపై లక్ష్మీ నృసింహ స్తోత్రము, శివ, విష్ణు, కృష్ణ, గణపతి, హనుమదాది దేవతల ఉపాసనలపై కూడ దివ్యమైన స్తోత్రములను రచించెను. మహేశం కలేశం సురేశం పరేశం క్వణద్రత్న మంజీర పాదార విన్దం యామునా చార్యుని శ్రీరామ భక్తివిశిష్టాద్వైత సంప్రదాయమున శ్రీ యామునాచార్యులు ప్రసిద్ధమైన రామ భక్తులు. వాల్మీకి రామాయణమునకు టీకను లిఖించిన వారిలో మాధవ యోగీంద్రులు, గోవిందాచార్యులు, రామానుజ కందాలాది అనేక విద్వాంసులు ఈ సంప్రదాయమును అనుసరించిన వారే. వాల్మీకి రామాయణమునకు సర్వోత్తమమైన టీక గోవిందాచార్యులు రచించినది. ఇతడు 12 సంవత్సరములు అఖండమైన తపస్సుతో శ్రీ రాముని ఆరాధించి వాని కృపను పొంది. ఈ వ్యాఖ్యానము రచించుట ప్రారంభించెను. ఈ సంప్రదాయమునకు మూల ప్రవర్తకులు ఆచార్య రామానుజులు అని చెప్పబడినది. అయినను ఇతడు రామభక్తిని గురించి దీక్షను తన గురువు శ్రీ యామునాచార్యుని దగ్గర పొందెను.యామునాచార్యులు వైష్ణవ సంప్రదాయమున గొప్ప ఆచార్యులు. వీరు శ్రీనాథముని పౌత్రులు, శ్రీ కశ్వర ముని పుత్రులు. వీరి ఆవిర్భావము 1010వ సం॥లో వీరనారాయణ (మధుర) యందు జరిగెను. వీరి జీవితము భగవత్ సేవలో భగవత్ కైంకర్యములో గడిచెను. శ్రీ యామునాచార్యునకు శ్రీ రామానుజాచార్యులనిన మిక్కిలి ప్రేమ. శ్రీ రామానుజా చార్యులు కూడ గురువుల యెడల భక్తి భావము గలిగియుండెను. శ్రీ యామునాచార్యులు రచించిన అన్ని గ్రంథములు లభించుట లేదు. కేవలము ఆగమప్రామాణ్యము, స్తోత్ర రత్నము, సిద్ధత్రయము, గీతార్ధ సంగ్రహాది కొన్ని గ్రంథములు లభించెను. యామునాచార్యునకు ఆలవన్దార్ అని మరొక నామము గలదు. ఇందువలన స్తోత్ర రత్నము సమాజ మందు ఆలవందార్ స్తోత్ర నామముతో విశేషముగ ప్రసిద్ధమయ్యెను. ఇది యేదో ఒక సంప్రదాయమునకే గాక, భక్తి సముదాయమునకు, అన్ని సంప్రదాయములు విద్వాంసులకు, భక్తులకు కంఠహారమైనది. చైతన్య మహాప్రభువు కూడ ఈ స్తోత్ర శ్లోకములను ప్రేమతో కీర్తనలుగ గానము చేసి ప్రవచనము చేసెను. ఈ విషయము చైతన్య 'చరితామృత మందు పలుమారులు లిఖించబడినది. ఈ స్తోత్ర మందు అలంకార విశేషము, భావప్రవణత, భగవంతునిపై పూర్ణ విశ్వాసము, శరణాగతి, అన్ని మతముల వారు ఆమోదించు విధముగ పక్షపాతము లేక-అనేక దివ్య గుణములు గలవు. అందువలన . సమస్త సంప్రదాయముల యందు గోస్వామి తులసీదాసు భక్తి భావము గలిగియుండినట్లే ఇతని యందును భక్తిభావము గలిగి యుండిరి. తులసీదాసు వలెనే శ్రీ యామునాచార్యులు కూడ శివ విష్ణు శక్త్యాదులందు భేద భావము చూపలేదు. యామునాచార్యులు శ్రీరాముని ప్రార్ధించుచు "ప్రభూ! ఈ ప్రపంచమున నాకు ఎవ్వరు లేరు. మీరే నా తల్లి తండ్రి పుత్ర మిత్ర కళత్ర గురువులు. నేను సత్యము చెప్పుచున్నాను. నీవు నా ఒక్కడి వాడవు గావు. అందరి వాడవు. నేను మీ దాసుడను, ఆశ్రితుడను, శరణాగతుడను. మీరు నన్ను పాలించి రక్షించుడు. పరహిత పరాయణా ! నన్నుద్ధరింపుము" అని ప్రార్ధించెను. శ్రీ తులసీదాసుని శ్రీరామ భక్తిప్రయాగ సమీపమున బాదా జిల్లా యందు రాజాపురమను ఒక గ్రామముండెను. అచట ఆత్మారామదూబే యను పేరు గల బ్రాహ్మణుడు నివసించు చుండెను. ఇతని ధర్మపత్ని 'హులసి'. వీరికి 1554 సం|| శ్రావణ శుక్ల సప్తమి దినమున అభుక్త మూలా నక్షత్ర మందు 12 మాసములు గర్భమందుండి గోస్వామి తులసీదాసు జన్మించెను. జన్మించి నప్పుడు బాలుడు రోదించక రామ నామము ఉచ్చరించెను. 32 దంతములు గలిగి 5 సంవత్సర ముల బాలుని వలె యుండెను. ఈ అద్భుత బాలుని గాంచిన తండ్రి అమంగళమేమోయని భయపడెను. తల్లి హులసి అనిష్టమే మోయని భయపడెను. ఈమె అత్త దశమి నాటి రాత్రి పురిటి శిశువును శుక్రవారము బాలునికి ఉపనయన సంస్కారము గావించెను. నేర్పింపకనే ఈ బాలుడు గాయత్రీ మంత్ర ముచ్చరించెను. ఇది గాంచిన వారందరు చకితులైరి. తరువాత నరహరి స్వామి వైష్ణవుల పంచ సంస్కారములు గావించి రామ మంత్ర దీక్ష నిచ్చి అయోధ్య యందే బాలునిచే అధ్యయనము చేయించు చుండెను. ఇచట కొద్ది దినము లుండి గురు శిష్యు లిద్దరు సూకర క్షేత్రమునకు వెళ్ళిరి. ఇచట శ్రీ నరహరి స్వామి తులసీదాసునకు రామ చరితమును వినిపించెను. ఇచట నుండి తులసీదాసు కాశీ వెళ్ళెను. కాశీ యందు శేషసనాతనుని వద్ద యుండి 15 సంవత్సరములు వేద వేదాంగములు అభ్యసించెను. తదుపరి గురు నాజ్ఞ పొంది జన్మ భూమికి తిరిగి వచ్చెను. అచట తన వారందరు మరణించిరని తెలిసికొని వారందరికి
|
|
|
www.sanatanadharm.com - play store app (sanatana dharm)
|
||
"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India. |
||